E-Paper
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో నకలీ దందా గుట్టురట్టు.. రూ.26 లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం

Hyderabad : హైదరాబాద్‌లో నకలీ దందా గుట్టురట్టు.. రూ.26 లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం
Advertisement
Hyderabad news today

Hyderabad news today(Telangana news live):

హైదరాబాద్‌లో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నకిలీ డ్రగ్స్ రాకెట్‌ను వెలికితీసింది. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి నకిలీ డ్రగ్స్‌ దందాపై.. డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక బృందం సేకరించిన ఇంటెలిజెన్స్‌ ఆధారంగా డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.

నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్‌టెన్షన్ , కొలెస్ట్రాల్ మందులు, అనాల్జెసిక్స్ ,ఇరవై ఆరు లక్షల విలువైన నకిలీ డ్రగ్స్ నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు .’ట్రాకాన్ కొరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొరియర్ షిప్పింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్‌కు నకిలీ డ్రగ్స్ రవాణాకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక బృందం దిల్‌సుఖ్‌నగర్ ,ఉప్పల్‌లోని కొరియర్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.

Advertisement

మెషిన్‌ పార్ట్‌ల పేరుతో కాశీపూర్‌ నుంచి రెండు పార్శిళ్లు వచ్చాయని.. అందులో 14.5 కిలోలతో ఒక పార్శిల్‌ కాగా,.. 13.34 కిలోలతో మరో పార్శిశ్‌లో ఉన్న నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు డీసీఏ అధికారులు. ఈ పార్శిల్‌లు రామ్‌నగర్‌ రోడ్డులోని అమర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ద్వారా బుక్‌ చేసిట్టు గుర్తించారు. కాశీపూర్ పొట్లాలను హైదరాబాద్ లోని పువ్వాడ లక్ష్మణ్‌ అనే వ్యక్తి మొబైల్ నంబర్ 8309612706కు డెలివరీ చేశారు. డీసీఏ అధికారులు.. పోలీసుల సహాయంతో మొబైల్ నంబర్ ద్వారా పువ్వాడ లక్ష్మణ్‌ను గుర్తించారు . దిల్‌సుఖ్‌నగర్‌లోని శివగంగా థియేటర్ సమీపంలోని బార్‌లో అతన్ని పట్టుకున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×