E-Paper
Advertisement

Hyderabad crime : భార్యతో గొడవ.. వీడియో కాల్ లో భర్త ఆత్మహత్య..

Hyderabad crime : భార్యతో గొడవ.. వీడియో కాల్ లో భర్త ఆత్మహత్య..
Advertisement

Hyderabad crime : భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. కొందరు గొడవ పడిన మరుక్షణం కలిసిపోతారు. మరికొందరు చిన్న విషయాన్ని పెద్దాదిగా చేసి.. విడిపోతుంటారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యల వరకు వెళ్తారు. తాజాగా ఉప్పల్ లో ఇదే ఘటన జరిగింది.

ఒక భర్త తన భార్యకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన ముత్తడి నరేష్ (28) అనే వ్యక్తి మెట్రో రైలు సిగ్నలింగ్ లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం నిత్యశ్రీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు ఉప్పల్ లోని సరస్వతి కాలనీలో నివాసం ఉంటున్నారు.

Advertisement

నిత్యశ్రీ సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. సీమంతానికి బంధువులను పిలిచే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త పెరిగి ఆస్తి తగాదాల వరకు వెళ్ళింది. నరేష్ మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం (డిసెంబర్ 29) తన భార్యకు వీడియో కాల్ చేసి తను చూస్తుండగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నరేష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×