E-Paper
Advertisement

శంషాబాద్‌లో ఘోర ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం!

శంషాబాద్‌లో ఘోర ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం!
Advertisement

Shamshabad Accident: శంషాబాద్‌ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బాధితుల స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

అసలేం జరిగింది?

Advertisement

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం పనుల నిమిత్తం కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. శంషాబాద్ వద్దకు రాగానే వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వెళ్లి రోడ్డు పక్కనున్న కల్వర్టును గుద్దింది. ఈ దెబ్బకు కారు ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యింది.

నలుగురు అక్కడికక్కడే మృతి

Advertisement

ఈ ఘోర ప్రమాదంలో కేతవత్ లింబ్య, జమున, మానసింగ్, వాస్రామ్‌ అనే నలుగురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ ఆశోక్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో, స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

రెస్క్యూ చర్యలు.. కేసు నమోదు

సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆశోక్‌ను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపి, పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

Tags

Related News

ORRపై ఘోర ప్రమాదం.. వ్యాన్ ఢీకొని ముగ్గురు దుర్మరణం!

యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య.. నెట్టింట ఇంటర్వ్యూ క్లిప్ వైరల్.. యాంకరే హత్యకు పురిగొల్పిందా?

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు

ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!

అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

Big Stories

Advertisement
×