Earthquake: తెలంగాణలోని పలు జిల్లాలలో భూకంపం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆయా జిల్లాలలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలలో భూ ప్రకంపనలు కనిపించాయి. పలుచోట్ల మూడు నుండి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం.
ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం కొంతసేపు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల బయటకు పరుగులు తీశారు.
సిరిసిల్ల, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాలతో పాటు వెంబడి గ్రామాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు తెలుపుతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు తడిమినట్లు, బీరువాలల్లోని వస్తువులు కదిలినట్లు కొంతమంది చెబుతున్నారు.
ఇప్పటి వరకు భూకంప తీవ్రతపై భూగర్భ పరిశోధనా విభాగం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇది భూకంపమేనా, లేక ఉపరితల ద్రవణమా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నుండి నివేదిక రావాల్సి ఉంది.
ప్రత్యేక సూచన..
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే జిల్లా మొత్తం భూకంపం వచ్చినట్లుగా ప్రచారం సాగడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: Jubileehills Crime: జూబ్లీహిల్స్‌లో బూతు దందా.. మరో సెక్స్ స్కాండల్ వెలుగులోకి..
గోలేటి సమీపంలో పులికుంట కేంద్రంగా భూకంపం
ఈరోజు సాయంత్రం గం. 6:50:22 ని. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా కంపించిన భూమి. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాలలోని పలుప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రత 3.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక వెబ్సైట్‌లో పేర్కొన్నది.