Jubileehills Crime: బూమ్ బూమ్ బీరు కంపెనీ ఎంత ఫేమసో చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో బూమ్ బూమ్ అంటే బీరు ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బీరు మత్తు ఇస్తే, హైదరాబాద్ లో బూమ్ బూమ్ పేరుతో సెక్స్ రాకెట్ సంచలనం సృష్టించింది. ఎట్టకేలకు పోలీసులు బూతు దందా భరతం పట్టారు. అయితే ఈ దందాలో కీలక పాత్ర పోషించింది ఓ మహిళ కావడం విశేషం.
అసలు విషయంలోకి వెళితే..
హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలోని ఏ రహదారి చూసినా బిజీబిజీగా కనిపిస్తుంది. దేశ, విదేశాల నుండి వచ్చి హైదరాబాద్ నగరంలో ఉపాధి పొందుతున్న వారు ఎందరో. అయితే కొందరు అమాయక యువతులను మాత్రం అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లిస్తూ తమ దందా సాగిస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు గుర్తించి వారి భరతం పడుతున్నారు. అలా వెలుగులోకి వచ్చిందే ఈ బూతు దందా.
జూబ్లీహిల్స్ లోనే దుకాణం..
హైదరాబాద్ నగరంలోని హైక్లాస్ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో మరోసారి సెక్స్ రాకెట్ బయటపడింది. సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ మహిళలతో వ్యభిచారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించి, కీలకంగా దాడులు నిర్వహించారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ రాకెట్‌ను ‘బూమ్ బూమ్’ అనే కోడ్ పేరుతో నడిపిస్తున్నట్లు గుర్తించారు.
ఎవరీ నాయక్..
జూబ్లీహిల్స్ బూతు దందాకు నాయక్ అనే వ్యక్తి ప్రధాన నిర్వాహకుడుగా పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్ ద్వారా థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతులను అక్రమంగా తీసుకొచ్చి, వీసా నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, ఇద్దరు మహిళలతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొబైళ్లు, బుకింగ్ డిటెయిల్స్ ఉన్న డైరీస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నెట్‌వర్క్ భాగంగా ఈ వ్యభిచార రాకెట్ దేశం మొత్తం విస్తరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని లింకులను వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.
Also Read: Earthquake: తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ఆ జిల్లాల ప్రజలు?
అక్రమంగా వచ్చి.. కటకటాల్లోకి
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన యువతి హైదరాబాద్ కు చేరుకొని బూతు దందాలో కూరుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. థాయ్ లాండ్ మీదుగా హైదరాబాద్ కు వచ్చిందని, ఓ వ్యభిచార నిర్వాహకురాలి సహాకారం ఈ యువతికి అందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు తెలిసే అవకాశం ఉందని చెప్పవచ్చు.