BigTV English

OTT Movie : నెలలోపే ఓటీటీలోకి వచ్చిన కన్నడ కామెడీ డ్రామా… తెలుగులో కూడా స్ట్రీమింగ్

OTT Movie : నెలలోపే ఓటీటీలోకి వచ్చిన కన్నడ కామెడీ డ్రామా… తెలుగులో కూడా స్ట్రీమింగ్

OTT Movie : ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. అందులోనూ కొన్ని సినిమాలైతే ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అలా కొన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి అన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియట్లేదు. అలాంటి సినిమానే ‘విద్యాపతి’ (Vidyapati). ఈ కన్నడ కామెడీ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


సైలెంట్ గా ఓటీటీలోకి…
కన్నడ యాక్షన్-కామెడీ-డ్రామా ‘విద్యాపతి’. ఈషామ్ ఖాన్, హసీన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 124 నిమిషాలు. నాగభూషణ ఎన్.ఎస్., మలైకా టి. వాసుపాల్ ప్రధాన పాత్రల్లో నటించగా… ధనంజయ, గరుడ రామ్, ధర్మన్న కడూర్, రంగాయణ రఘు తదితరులు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ధనంజయ నిర్మించిన ఈ చిత్రం, దాలి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందగా, 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) కన్నడ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

నిర్మాతలు ముందుగా ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ రావడంతో ప్రమోషన్లలో జోరు పెంచారు. ఇక ఈ మూవీ ఓటీటీ పార్టనర్ గురించి థియేటర్లలో వెల్లడించలేదు. కానీ ముందుగా ఈ మూవీ రైట్స్ ను జీ5 ఓటీటీకి అమ్మేశారు. కానీ మే 3 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం.


కథలోకి వెళ్తే…
సిద్దు (నాగభూషణ) / విద్యాపతి ఒక సాధారణ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం నుండి వచ్చిన యువకుడు. అందుకే అతను ఆడంబరమైన జీవితాన్ని కోరుకుంటాడు. కానీ ఎప్పుడూ బాధ్యతారహితంగా, లేజీగా ఉంటాడు. మొత్తానికి సూపర్‌ స్టార్ విద్య (మలైకా వాసుపాల్)ను ప్రేమలో పడేలా చేసి, మోసం చేసి ఆమెను వివాహం చేసుకుంటాడు. విద్య కీర్తి, సంపాదనను ఆస్వాదిస్తూ… ఆమె మేనేజర్-కం-భర్తగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అతనికి ఆమె కంటే, విద్యా స్టార్‌డమ్‌ అంటేనే ఎక్కువ ఇష్టం. విద్య మాత్రం అతన్ని, అతని వేశాలను సహిస్తూ, అతనిపై నిజమైన ప్రేమను చూపిస్తుంది.

Read Also : భర్తను చంపి శృం*గా*రంలో మునిగిపోయే జంట… ఈ సినిమాను ఒంటరిగానే చూడండయ్యా

ఒక రోజు సిద్దు – విద్య డేట్‌కు వెళతారు. అక్కడ స్థానిక గుండా జగ్గు (గరుడ రామ్) విద్యతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సిద్దుకు ఉన్న భయం, అసమర్థత వల్ల ఆమెను వాడి నుంచి రక్షించలేకపోతాడు. దీంతో విద్య, సిద్దును తన ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది. దీంతో సిద్దు తన పాత జీవితానికి అంటే… తన తండ్రి, సవతి తల్లి, సవతి సోదరి, మెకానిక్ స్నేహితుడి దగ్గరకు తిరిగి వెళ్తాడు. ఈ సంఘటనతో అతని అహం దెబ్బతింటుంది. దీంతో జీవితంలో మొదటిసారి బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. సిద్దు ఎలాగైనా తన గౌరవాన్ని, విద్య ప్రేమను తిరిగి పొందాలని డిసైడ్ అవుతాడు. మరి అనుకున్నది సాధించడానికి సిద్ధూ ఏం చేశాడు? అన్నది మిగిలిన స్టోరీ.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×