BigTV English

Adah Sharma: అలాంటి సమస్యతో బాధపడుతున్న అదాశర్మ.. మొత్తం కందిబారిపోయి..!

Adah Sharma: అలాంటి సమస్యతో బాధపడుతున్న అదాశర్మ.. మొత్తం కందిబారిపోయి..!

Adah Sharma: కొంతమందికి సినిమా అంటే ఎంత ఇష్టం అంటే సినిమా కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఇక ఈ సినిమాల కారణంగానే కొంతమంది ఇప్పటికీ కోలుకోలేని సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇక ఇంకొంతమంది ఒంటికి దెబ్బలు తగిలినా.. సినిమా మాత్రం బాగా వస్తే చాలు అనుకున్నారు. అందుకోసం తమ శరీరాన్ని కూడా కష్టపెడుతూ ఉంటారు. అలా శరీరాన్ని సినిమా కోసం ఇబ్బంది పెడుతున్న నటీనటులలో హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో అదా శర్మ (Adah Sharma)కూడా ఇదే కోవకు చెందినవారు అని చెప్పవచ్చు. 2008లోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె.. మొదట హిందీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నితిన్ (Nithin) తో కలిసి ‘హార్ట్ ఎటాక్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.


అలాంటి సమస్యతో బాధపడుతున్న అదా శర్మ..

ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత ఈమెకు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి. అలా అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి, గరం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలలో నటించింది. 2023లో రిలీజ్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ది కేరళ స్టోరీ’. ఇందులో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించడమే కాకుండా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ముఖం మొత్తం ఎర్రబారిపోయి కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ అయ్యో ఈమెకు ఏమైంది? ఎందుకు ఇలా చర్మం ఎర్రగా మారిపోయింది..? అంటూ కంగారు పడుతున్నారు.


హైడ్రేటెడ్ గా ఉండండి.. సురక్షితంగా ఉండండి – అదా శర్మ

అయితే ఈ ఫోటోలను కాస్త గమనిస్తే.. అవి ఇప్పటివి కావు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా షూటింగ్ సమయంలో తీసినవి. ఈ సినిమా రిలీజ్ అయ్యి మే 5 కి సరిగా రెండేళ్లు. అంటే ఈరోజుకి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఫోటోలు షేర్ చేసింది. అంతేకాదు కింద క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ. “మానవ మెదడు 75% నీటితో నిర్మితమైంది. డీ హైడ్రేషన్ సమస్య అనేది దృష్టి, మానసిక శక్తి, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ మైనస్ 16 డిగ్రీల వాతావరణం లో జరిగింది. ఫలితంగా నా బాడీ డీ హైడ్రేట్ అయింది .దాంతో పెదవులు మొత్తం పగిలిపోయాయి. మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలాయి. ముఖం మొత్తం ఎర్రబారిపోయింది. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఇకపోతే ఇప్పుడు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక మంచి పోస్టు చేయాలనుకున్నాను. కానీ ఎన్నో ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఏది పోస్ట్ చేయాలో తెలియడం లేదు. నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఈ సినిమా అందించింది. మీరు కూడా హైడ్రేటెడ్ గా ఉండండి. సురక్షితంగా ఉండండి” అంటూ రాసుకొచ్చింది ఆదాశర్మ. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ALSO READ:Animal Movie OTT : తెలుగు డైరెక్టర్ మూవీ… కానీ, తెలుగులో మాత్రం లేదు… నెట్‌ఫ్లిక్స్ ఇదేం పంచాయితీ..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×