E-Paper
Advertisement

భద్రాద్రి కొత్తగూడెంలో అర్ధరాత్రి భూప్రకంపనలు, రోడ్ల మీదకు ప్రజలు పరుగులు, వాతావరణంలో మార్పులు

భద్రాద్రి కొత్తగూడెంలో అర్ధరాత్రి భూప్రకంపనలు, రోడ్ల మీదకు ప్రజలు పరుగులు, వాతావరణంలో మార్పులు
Advertisement

Bhadradri Kothagudem: వాతావరణంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఫిలిప్పీన్స్‌లో ఏడు పైగా భూకంపం వచ్చింది. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెంలో అర్ధరాత్రి భూప్రకంపనలు

Advertisement

శనివారం అర్ధరాత్రి ధాటిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఒక్కసారి భూమి కాస్త షేక్ కావడంతో బయటపడ్డారు ప్రజలు. ఉన్నట్లుండి భూమి కాస్త కంపించడంతో హడలిపోయారు. పిల్లలతోపాటు అంతా రోడ్లపైకి పరుగులు తీశారు. కాసేటికి గానీ వారిలో ఆ భయం తగ్గలేదు.

సమయంలో భయపడిన ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం-NCS వివరాల మేరకు శనివారం అనగా జూన్ 14, 2026 అర్ధరాత్రి 2.25 గంటల ఒక్కసారిగా భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు, ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదు అయ్యింది.

Advertisement

రిక్టర్ స్కేలుపై 3.8 గా నమోదు.. రోడ్ల మీదకు ప్రజలు పరుగులు

ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం ఏపీలోని రాజమండ్రికి వాయువ్య దిశగా 111 కిలోమీటర్ల దూరంలోని భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు గుర్తించారు. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.

ఉన్నట్లుండి అర్ధరాత్రి వేళ ఇంటిలోని పాత్రలు పైనుంచి కిందకు పడిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు ప్రజలు. ప్రాణభయంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్వల్ప భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ-ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు నివేదికలు అందలేదు. భూప్రకంపనలతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.

ALSO READ: హైదరాబాద్‌కు భారీ వర్షాల ముప్పు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Related News

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

Big Stories

Advertisement
×