E-Paper
Advertisement

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో
Advertisement

Shark Thriller OTT: షార్క్ సినిమాలు అంటే… సాధారణంగా సముద్రంలో చిక్కుకున్న మనుషులు ఆ భారీ ప్రాణుల నుంచి ప్రాణాలు కాపాడుకునే కథలే గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి షార్క్ నుంచి తప్పించుకోవడానికి కాదు… దాన్ని చంపడానికి సముద్రంలోనే ఉండిపోతాడు. అంతేకాదు, తన ప్రతీకారం కోసం అమాయకుల ప్రాణాలను కూడా లెక్కచేయడు. అలాంటి ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కిన హాలీవుడ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ Chum. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మూవీ తెలుగులో ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కొత్తగా పెళ్లైన రాస్, హనీ దంపతులు తమ జీవితంలోని ప్రత్యేకమైన రోజును గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం పెళ్లి రోజునే సముద్రంలో లగ్జరీ బోట్ ట్రిప్‌కు వెళ్తారు. అందమైన ప్రయాణంగా మొదలైన ఆ టూర్ ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. ఎందుకంత అక్కడ ఒక భారీ గ్రేట్ వైట్ షార్క్ వారి బోట్‌పై దాడి చేస్తుంది.

Advertisement

ఆ దాడిలో రాస్ కళ్ల ముందే అతని భార్య ప్రాణాలు కోల్పోతుంది. ఆ సంఘటన అతనికి కోలుకోలేని షాక్ ఇస్తుంది. ఆ దుఃఖాన్ని జీర్ణించుకోలేని రాస్, నెమ్మదిగా మానసికంగా కుంగిపోతూ ఒకే లక్ష్యంతో జీవించడం మొదలు పెడతాడు… తన భార్యను చంపిన షార్క్‌ను ఎలాగైనా అంతం చేయాలని అనుకుంటాడు. దాని కోసం సముద్రంలోనే ఉండిపోతూ, రక్తం, మాంసంతో షార్క్‌ను ఆకర్షించే ప్రమాదకరమైన ప్లాన్ వేస్తాడు. కానీ ప్రతీకారం పెరిగేకొద్దీ అతని ఆలోచనలు మరింత భయంకరంగా మారుతాయి.

తన లక్ష్యం కోసం ఇతరుల ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తీసుకునే నిర్ణయాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఆ షార్క్ ను ఎలాగైనా చంపి, ప్రతీకారం తీర్చుకోవాలనే కసి కాస్తా ఉన్మాదంగా మారుతుంది. దీంతో సైకోలా మారిపోతాడు. అసలు రాస్ తన ప్రతీకారం తీర్చుకున్నాడా ? లేక ఆ పగే అతన్ని పూర్తిగా నాశనం చేసిందా ? షార్క్‌తో అతని మైండ్ గేమ్ ఎలా ముగిసింది ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎంచక్కా తెలుగులో చూడవచ్చు

Advertisement

‘చమ్’ మూవీ Lionsgate Playలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఓటీటీలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సముద్రం మధ్యలో సాగే టెన్షన్, షార్క్ దాడులు, సర్వైవల్ ఎలిమెంట్స్, ఒక మనిషి మానసిక పతనాన్ని దర్శకుడు మార్కస్ ఆడమ్స్ ఉత్కంఠభరితంగా చూపించారు. ముఖ్యంగా షార్క్‌తో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. Jaws, The Shallows, 47 Meters Down తరహా షార్క్ సర్వైవల్ థ్రిల్లర్లు నచ్చితే… Chum కూడా వాచ్‌లిస్ట్‌లో ఉండాల్సిన సినిమానే. కేవలం షార్క్ దాడులే కాదు… ప్రతీకారం ఒక మనిషిని ఎంత ప్రమాదకరంగా మార్చగలదో చూపించే సైకలాజికల్ కోణం కూడా ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణ. సస్పెన్స్, యాక్షన్, హారర్ కలిసిన ఈ డిఫరెంట్ హాలీవుడ్ థ్రిల్లర్ ను ఈ వీకెండ్‌లో ఒకసారి చూడొచ్చు.

Read Also: కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి

Related News

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×