E-Paper
Advertisement

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!
Advertisement

Fake VPN Apps: మన దేశంలో రోజు రోజుకీ మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మన డేటాను, ఇంటర్నెట్ కనెక్షన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి చాలామంది ఉచిత  VPN యాప్స్‌ను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. కానీ అదే వీపీఎన్ యాప్స్ రూపంలో హ్యాకర్లు మన బ్యాంక్ ఖాతాలకు కన్నం వేస్తున్నారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్‌స్కీ హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సురక్షితం అనుకుంటే ముంచేసాయి:

మనం సురక్షితంగా ఉంటాం అనుకుని వాడే కొన్ని ఫేక్ యాప్స్, నిజానికి మన ఫోన్‌ను హ్యాకర్ల చేతుల్లో పెడుతున్నాయి. ఇవి మన డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి బదులు ప్రొక్సీ సర్వర్లుగా మారతాయి. దీనివల్ల మన ఫోన్ ద్వారా జరిగే ఆన్‌లైన్ లావాదేవీలు, బ్యాంకింగ్ వివరాలు నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన ఫోన్లలో ఉండే సాధారణ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా ఈ ఫేక్ యాప్స్‌ను గుర్తించలేవు.

Advertisement

Also Read: వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

వెంటనే డిలీట్ చేయాల్సిన యాప్స్:

మన ఫోన్ సురక్షితంగా ఉండాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ కాకుండా ఉండాలన్నా ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ ఆరు యాప్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ProxyGate, Mask VPN, Shield VPN, Shine VPN, Dew VPN, Paladin VPN అనే యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఇవి మన ఫోన్లో ఉన్నంత కాలం హ్యాకర్లు మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలను చాలా సులభంగా దొంగిలిస్తారు.

జాగ్రత్తలు పాటించడం ఎలా?

Advertisement

కేవలం ఒరిజినల్ VPN యాప్స్ వాడినంత మాత్రాన పూర్తిగా సురక్షితం అని చెప్పలేం. బ్యాంకుల పేరుతో వచ్చే నకిలీ లింకులు, మెసేజ్‌ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేసి మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ నమోదు చేయకూడదు. అలాగే మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్‌కు ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ లేదా పిన్ నెంబర్ లాంటి అదనపు సెక్యూరిటీ లాక్స్ పెట్టుకోవడం చాలా మంచిది.

Also Read: 25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

Tags

Related News

Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!

ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

Big Stories

Advertisement
×