E-Paper
Advertisement

Heavy Rains: హైదరాబాద్‌కు భారీ వర్షాల ముప్పు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Heavy Rains: హైదరాబాద్‌కు భారీ వర్షాల ముప్పు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Heavy Rains: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం హై అలర్ట్ తో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సీఎం ఆదేశం..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శితో సహా సీనియర్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాలు కురిసిన సందర్భాల్లో నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు సత్వరం తీసుకోవాలని చెప్పారు. వర్షాలపై వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందస్తు ప్రణాళికతో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బృందాలను మోహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Also read: Tank Neglect: జహీరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న రైతుల పొలాలు!

హైడ్రా ప్లాన్..

వ‌ర్షాకాలం ఆరంభం కావటంతో అన్ని ప్రభుత్వ శాఖలు సహాయక చర్యలకు సిద్దమవుతున్నాయి. కానీ టెక్నికల్ గా సహాయక చర్యలు చేపట్టే హైడ్రా మరో అడుగు ముందుకేసి భారీ వాహానాలు వెళ్లలేని చోటకు సకాలంలో చేరుకుని, సహాయక చర్యలను చేపట్టేందుకు వీలుగా బైక్ టీమ్ లను సిద్దం చేసింది. ఈ నెల 9వ తేదీన కేవలం గంట స‌మ‌యంలో 10 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన సంగతి తెల్సిందే.

Advertisement

Also Read: Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×