BigTV English

BRS Party Fund : బీఆర్ఎస్ దగ్గర అంత డబ్బా? దేశంలోనే అత్యధికంగా రూ.1,449 కోట్లు!

BRS Party Fund : బీఆర్ఎస్ దగ్గర అంత డబ్బా? దేశంలోనే అత్యధికంగా రూ.1,449 కోట్లు!

BRS Party Fund : దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస తర్వాత.. అత్యధిక నిధులు కలిగి ఉన్న పార్టీ ఏదో తెలుసా.? విరాళాలు, నిధుల రూపంలో సేకరించిన సొమ్ముల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న ప్రాంతీయ పార్టీ ఏదో మీరు ఊహించగలరా.?. ఏ ఉత్తరాది పార్టీనో అయ్యిఉంటుందని అనుకుంటున్నారా., లేదు తరాలుగా అధికారంలో పార్టీని సంస్థాగతంగా నిలదొక్కుకున్న పాత పార్టీలు అనుకుంటున్నారా. అయితే.. మీరు కూడా అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే.. అత్యధిక నిధుల్ని సేకరించిన పార్టీగా మన తెలంగాణకు చెందిన పార్టీ నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల కంటే చాలా ఎక్కువగా నిధుల్ని దగ్గరపెట్టుకుని.. మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే.. తెలంగాణ రాష్ట్ర సమితి -బీఆర్ఎస్


ప్రాంతీయ పార్టీలపరంగా అత్యధిక నిధులున్న పార్టీగా భారత రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ఎవరో బయట వాళ్లు చెప్పింది కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా భారత ఎన్నికల సంఘానికి తెలియజేసిన ఆడిట్ లో ఉంది. ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు, మిగతా రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ అయ్యింది. ఎందుకంటే.. బీఆర్ఎస్ దరిదాపుల్లో ఏ పార్టీ నిధులు లేవు కాబట్టి.

పార్టీలు సేకరిస్తున్న నిధులు, ఖర్చుల వివరాల్ని ప్రతీ ఏటా భారత ఎన్నికల సంఘానికి తెలపాల్సి ఉంటుంది. ఈ కారణంగానే.. గత లోక్ సభ ఎన్నికల్లో ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘాం ఆదేశాల మేరకు.. అన్ని పార్టీలు తమ నిధులు, ఖర్చుల వివరాల్ని సమర్పించాయి. ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికలను ఈసీ పరిశీలించి.. తన అధికారిక వెబ్ సైట్ లో ప్రచురిస్తుంది. దాని ప్రకారం.. దేశంలోనే అత్యధిక ధనవంతమైన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఎన్ని నిధులున్నాయో తెలుసా.. ఏకంగా రూ.1,449 కోట్లు.


బీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లోకి మరే ఇతర పార్టీ రాలేదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ ఖాతాల్లో రూ.1,519 కోట్లు ఉన్నాయంట. అప్పటికే.. ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీకి ఎన్నికల ప్రకటన ముగిసే లోగా.. మరో రూ.47.56 కోట్ల విరాళాల రూపంలో వచ్చాయంట. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన ఆడిట్ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు.. ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల కోసం రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పార్టీ వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ ఎంపీల ప్రచార ఖర్చులను సైతం వెల్లడించిన పార్టీ.. ఎన్నికల ప్రచార సామగ్రికి రూ. 34.68 కోట్లు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలకు రూ.20.37 కోట్లు వెచ్చించినట్లు ఆడిట్ రిపోర్టులో పేర్కొంది.

అదే తీరుగా ఇతరత్రా ప్రచారానికి రూ.34.39 కోట్లు వ్యయం చేసినట్లు ఈసీకి తెలిపింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లోని అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.95 లక్షల చొప్పున మొత్తం రూ.16.15 కోట్లను నేరుగా చెక్/డీడీ ద్వారా ఇచ్చినట్లు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల నేరచరిత్రపై ప్రకటనలకు ఇచ్చేందుకు రూ.73.17 లక్షలు వెచ్చించినట్లు భారత రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ వెల్లడించింది.

అత్యధిక నిధులున్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కంటే ముందు వరకు ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ ఉండదే. దాన్ని అధిగమించిన బీఆర్ఎస్ పార్టీ ఏకంగా రూ.1,449 కోట్లతో మొదటి స్థానంలోకి వచ్చింది. కాగా.. దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీల నిధుల నిల్వల్ని పరిశీలిస్తే.. తమిళనాడులోని అధికార డీఎంకే ఖాతాలో రూ.338 కోట్లు, సమాజ్ వాదీ పార్టీకి రూ.340 కోట్లు, తెలుగుదేశానికి రూ.272 కోట్ల బ్యాంకు నిల్వలున్నట్లు తెలిసింది. అలాగే.. జేడీయూకు రూ.147 కోట్లు, వైకాపా ఖాతాలో రూ.27 కోట్ల ముగింపు నిల్వలున్నాయని.. ఆయా పార్టీలో ఈసీకి సమర్పించిన నివేదికల్లో ఉన్నాయి.

Also Read : పల్టీలు కొట్టిన కారు వాళ్ళు తిరిగి రారు

ఈ నివేదిక వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. తరతరాలుగా అధికారంలో ఉన్న పార్టీలు, రెండు, మూడు తరాలుగా ముఖ్యమంత్రులుగా పని చేసిన పార్టీల దగ్గర సైతం లేనన్ని నిధులు బీఆర్ఎస్ దగ్గర పోగయ్యాయి. తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్..  సకల జనుల చందాలతో అప్పట్లో కార్యక్రమాల్ని నడిపించారు. అలాంటిది.. తొమ్మిదేళ్ల అధికారంలో ఇన్ని కోట్లు ఎలా సమీకరించిందా.. అంటూ మాట్లాడుకుంటున్నారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×