Mulayam Singh Yadav’s Birth Anniversary: ఉత్తర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్ వాదీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఈ వేడుకలను నిర్వహించారు.సమాజ్ వాదీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేతలు నిత్య కళ్యాణ్, నర్సింగ్ మాదిగ కలిసి ములాయం సింగ్ జయతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ములాయం సింగ్ యాదవ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎస్పీ నాయకులు
ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.. ఫుట్ పాత్ మీద ఉన్న అభాగ్యులకు, పేదవారికి, క్యాన్సర్ రోగులకు, భోజనాలను అందించారు. ఆస్పత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ములాయం సింగ్ యాదవ్ దేశ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.
Read Also: అదానీ అంశాన్ని తలకెత్తుకున్న కేటీఆర్.. దాని వెనకున్న అసలు కథ ఇదేనా?
పార్టీ బలోపేతం కోసం కృషి
సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారథ్యంలో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం దక్కేలా పార్టీ పోరాటం చేస్తుందన్నారు పార్టీ నాయకులు. తెలుగు రాష్ట్రాల్లో సమాజ్ వాదీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయ ఢంకా మోగించబోతుందన్నారు. మరోసారి యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ బాధ్యతలు చేపట్టబోతున్నారని చెప్పారు. తెలంగాణాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: బీఆర్ఎస్ దగ్గర అంత డబ్బా? దేశంలోనే అత్యధికంగా రూ.1,449 కోట్లు!