BigTV English

Sanjay Raut: ‘మహారాష్ట్ర ఎన్నికల్లో అంతా మోసం.. అదానీ సాయంతోనే మహాయుతి గెలుపు’

Sanjay Raut: ‘మహారాష్ట్ర ఎన్నికల్లో అంతా మోసం.. అదానీ సాయంతోనే మహాయుతి గెలుపు’

Sanjay Raut| దేశంలో అత్యంత ధనిక రాష్ట్రమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సంచలనంగా మారాయి. ఎవరూ ఊహించిన విధంగా బిజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే మహాయుతి కూటమి విజయంపై శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే (యుబిటి) కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తూ.. అదానీ ధన బలంతో ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు.


“బిజేపీ కూటమికి 200 సీట్లు ఎలా వస్తాయి. ఇది అసాధ్యం. ఏక్ నాథ్ షిండే పార్టీకి 56-60 సీట్లలో గెలుపు, అజిత్ పవార్ కు 40కు పైగా సీట్లలో గెలుపు ఎలా సాధ్యమవుతుంది. మేము గ్రౌండ్ లెవెల్ లో పనిచేశాం. మాకు ఎన్నికల ఫలితాలపై అంచనా ఉంది. ఇది మహారాష్ట్ర ప్రజల తీర్పు కాదు. అదానీ అండదండలతోనే మహాయుతి విజయం సాధించింది. అంతేకానీ ఈ ప్రజా తీర్పు కాదు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు బాగా తెలుసు.

Also Read: వయనాడ్‌ ఉపఎన్నికల్లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. భారీ మెజారిటీతో విజయం దిశగా కాంగ్రెస్


మా కూటమి (మహా వికాస్ అఘాడీ)కి 75 సీట్లు కూడా రాలేదంటే ఈ ఎన్నికల ఫలితాలపై అనుమానం కలుగుతోంది. మేము ఈ ఫలితాలను అంగీకరించం. మహారాష్ట్ర ప్రజలు మోసం చేసేవారు కాదు. కానీ బిజేపీ నేతృత్వంలోని మహాయుతి ఎంతటి మోసమైనా చేయగలదు. ఈ ఫలితాలను అదానీ డబ్బుతో కొనుగోలు చేశారు.” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మహాయుతి ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన లాడ్లీ బహిన్ (ముద్దల చెల్లెలు) సంక్షేమ పథకం వల్ల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా మారాయా? అని మీడియా ప్రశ్నించగా?.. “లాడ్లీ బహిన్ కాదు లాడ్లీ భాయ్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారు. ఆ లాడ్లీ భాయ్ మరెవరో కాదు అదానీ. ఆయన ధన బలంతోనే గత రెండు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు కూడా అదానీ ధన ప్రభావంతో మాకు ఈ ఫలితాలొచ్చాయి. ఈ రాష్ట్రంలో ఎవరికైనా 200 సీట్లు వచ్చాయా? శరద్ పవార్ లాంటి నాయకుడికి ప్రజలు 10 సీట్లు మాత్రమే కట్టబెడతారా? విజయం, ఓటమి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ప్రజల తీర్పు కానేకాదు. ఏదో మోసం జరిగింది.

అదానీకి నిన్న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అదానీ అవినీతి చేశారని ఆరోపణలు వచ్చాయంటే పరోక్షంగా బిజేపీ చేసిందని, ఏక్ నాథ్ షిండే చేశారని ఆరోపించినట్లే. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కు చెందిన ఎమ్మెల్యేలందరూ ఎలా ఎన్నుకోబడ్డారు?. దేవేంద్ర ఫడ్నవీస్, నరేంద్ర మోడీ, అమిత్ షా.. వీళ్లు మహారాష్ట్ర కోసం ఏం చేశారని బిజేపీకి 120 సీట్లు వస్తాయి? ఈ ప్రశ్న మేము మాత్రమే కాదు ప్రజలు కూడా అడుగుతారు?” అని సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మరోవైపు బిజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాల్వియా ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. “ఒక్క ఏక్ నాథ్ షిండే పార్టీకే 56 సీట్లకు వచ్చాయి. ఈ సంఖ్య అన్ని ఇండియా కూటమిలో అన్ని పార్టీలకు వచ్చిన సీట్ల సంఖ్య 49 కంటే ఎక్కువ. జార్జి సోరోస్ అతని కిరాయి మనుషులు సాయం చేసినా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి దేశంలో విజయం దక్కలేదు.” అని రాశారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×