E-Paper
Advertisement

“చెరువులను మింగేసే వాళ్ల ఆటలు సాగవ్!”.. అంబర్‌పేట్ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

“చెరువులను మింగేసే వాళ్ల ఆటలు సాగవ్!”.. అంబర్‌పేట్ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Revanth Reddy Fires on  Sudhakar Reddy:మూసారాంబాగ్ లోని వంతెనని ప్రారంభించిన సీఎం అంబర్ పేట్ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డిపై తనదైన శైలిలో మాటాల తూటాల్ని వదిలాడు .ఈ సందర్బంగా సీఎం రేవంత్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటను కబ్జా చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని సవాల్ విసిరారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, స్థానిక నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి వైఖరిపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు . ముఖ్యంగా అంబర్‌పేట్‌లోని చారిత్రాత్మక బతుకమ్మ కుంట కబ్జా చేసి ఆ భూములను మింగేయాలని చూసింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని కుండబద్దలు కొట్టారు.

Advertisement

సీఎం కేసీఆర్ వస్తే హెలికాఫ్టర్ లో పూలు కురిపించిన ఎడ్ల సుధాకర్ రెడ్డి నిబంధనలను పక్కనబెట్టి, అక్రమంగా చెరువులను మింగేసేందుకు కుట్రలు పన్నుతున్న తీరుని ఎండగట్టారు.హైడ్రా ని పెట్టి ప్రజల ఆస్తులను కాపాడుతున్న తనపై తిరిగి నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు.

అక్రమార్కుల ఆట కట్టిస్తూ, బతుకమ్మ కుంటను కబ్జాదారుల పంజా నుంచి విడిపించి స్థానిక ఆడబిడ్డలకు అప్పగించామని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిజమైన సంక్రాంతి కానుక అని తేల్చిచెప్పారు.ఇక హైదరాబాద్ నగరం గ్లోబల్ మ్యాప్‌లో స్పీడ్‌గా దూసుకుపోతున్నా, దానికి తగ్గట్టుగా గత పదేళ్లలో కనీస సౌకర్యాల్ని అందించడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిందని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.

Advertisement

ALSO READ:1వ తేదీనే జీతాలిస్తున్నా బెదిరిస్తారా?.. ఉద్యోగ సంఘాలపై సీఎం హాట్ కామెంట్స్ !

అందుకే తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ‘క్యూర్‌, ప్యూర్‌, రేర్‌’ అనే ప్రత్యేకమైన ఒక మంచి విజన్‌తో ముందుకెళ్తోందని చెప్పారు. గతంలో వరదలు వచ్చినప్పుడు మూసీ తీరప్రాంత ప్రజల గోడును పట్టించుకోని వారు, అంబర్‌పేట్‌లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించకుండా పేదలను నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే, పూర్తి సైంటిఫిక్ అప్రోచ్‌తో ఈ కొత్త మూసారాంబాగ్ వంతెనను నిర్మించి పబ్లిక్‌కు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

ఇక నిరుద్యోగుల విషయంలో గత సర్కార్ చేసిన మోసాలను రేవంత్ రెడ్డి ఎండగట్టారు. పదేళ్ల కాలంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 అని మాటలు చెప్పడమే తప్ప ఒక్క రిక్రూట్‌మెంట్‌ను కూడా సరిగ్గా పూర్తి చేయలేదని మండిపడ్డారు . కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వేలాది ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో మెగా డీఎస్సీ నిర్వహించడంతో పాటు అన్ని రకాల గ్రూప్స్ ఎగ్జామ్స్ పూర్తి చేసి, పారదర్శకంగా ఏకంగా 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను యువతకు అందించామని ప్రకటించారు.

ALSO READ:రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్

గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది, తెలంగాణను ప్రగతి వైపు పరుగులు పెట్టిస్తుంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఏ శక్తుల ఆటలు ఇక్కడ సాగవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags

Related News

1వ తేదీనే జీతాలిస్తున్నా బెదిరిస్తారా?.. ఉద్యోగ సంఘాలపై సీఎం హాట్ కామెంట్స్ !

ఫీజు బకాయిల వివాదం.. సీఎంకు రాష్ట్ర బీజేపీ చీఫ్ లేఖ.. అపాయింట్మెంట్‌కు విజ్ఞప్తి!

‘ప్రజాధనం తిన్న పందికొక్కు’.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు!

ఆడబిడ్డల చీరల్లో అవినీతి ..మీ బతుకు చెడా ..మీదీ ఒక బతుకేనా .. సీఎం రేవంత్ ఉగ్రరూపం !

నర్స్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. బిహార్ మెకానిక్ అరెస్ట్

మూసారాంబాగ్‌ వంతెన వచ్చేసింది.. ఇక ఆ రూట్‌లో ట్రాఫిక్‌ బాధలు లేనట్టే!

రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్

Big Stories

Advertisement
×