E-Paper
Advertisement

‘ప్రజాధనం తిన్న పందికొక్కు’.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు!

‘ప్రజాధనం తిన్న పందికొక్కు’.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు!
Advertisement

Revanth Reddy Slams KCR:మూసారాంబాగ్ వంతెన ప్రారంభోత్సవం సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై తీవ్రమైన విమర్శలు చేశారు.

కేసీఆర్ తన పదవీకాలంలో 1,000 రోజుల వ్యవధిలో దాదాపు రూ. 22.24 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని సెన్సేషన్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో కేసీఆర్ భద్రత కోసం ప్రభుత్వ ఖజానా నుండి ఎంత చెల్లించారనే ఖర్చుల వివరాలను బయటపెట్టారు.

Advertisement

ప్రధానంగా కేసీఆర్ వేతనానికి సంబంధించిన లెక్కలను చెబుతూ ఈ 1,000 రోజుల కాలంలో ఆయన రూ. 1,24,44,000 (ఒక కోటి ఇరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు) జీతంగా అందుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

కేవలం జీతం మాత్రమే కాకుండా, ఆయనకు కల్పించిన అత్యున్నత స్థాయి భద్రత (సెక్యూరిటీ), ప్రయాణాల కోసం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మరియు వాటికి సంబంధించిన నిర్వహణ వ్యయం కోసమే ప్రభుత్వం రూ. 21 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విధంగా మొత్తం కలిపి ₹22.24 కోట్ల భారీ మొత్తాన్ని కేవలం విపక్ష నేత అనే ఒకే ఒక్కకారణంతో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని విమర్శించారు.

Advertisement

ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ , ప్రజల పన్నుల రూపంలో వచ్చిన కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకున్న కేసీఆర్, సాధారణ ప్రజల కష్టాల గురించి లేదా వారి సమస్యల పరిష్కారం గురించి ఏనాడైనా ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని ఈ స్థాయిలో వినియోగించుకున్న నాయకుడు ప్రజలకు జవాబుదారీగా ఉండటంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు.

also read:ఆడబిడ్డల చీరల్లో అవినీతి ..మీ బతుకు చెడా ..మీదీ ఒక బతుకేనా .. సీఎం రేవంత్ ఉగ్రరూపం !

సాధారణంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బయటికి రాకుండా భయపడతాయని ,కానీ తెలంగాణ రాష్ట్రంలో దానికి పూర్తి భిన్నంగా ప్రతిపక్షం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు.

ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మరియు ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమైనందున, ఆయన వెంటనే తన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఒకవైపు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, మరోవైపు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గానీ, బయట గానీ గొంతు విప్పకపోవడం సరికాదని విమర్శించారు.

also read:రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్

ఈ రకంగా కేసీఆర్ పదవీకాలంలో జరిగిన ఖర్చులు, ప్రస్తుత ప్రతిపక్ష వైఫల్యాలను ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Tags

Related News

1వ తేదీనే జీతాలిస్తున్నా బెదిరిస్తారా?.. ఉద్యోగ సంఘాలపై సీఎం హాట్ కామెంట్స్ !

ఫీజు బకాయిల వివాదం.. సీఎంకు రాష్ట్ర బీజేపీ చీఫ్ లేఖ.. అపాయింట్మెంట్‌కు విజ్ఞప్తి!

ఆడబిడ్డల చీరల్లో అవినీతి ..మీ బతుకు చెడా ..మీదీ ఒక బతుకేనా .. సీఎం రేవంత్ ఉగ్రరూపం !

నర్స్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. బిహార్ మెకానిక్ అరెస్ట్

మూసారాంబాగ్‌ వంతెన వచ్చేసింది.. ఇక ఆ రూట్‌లో ట్రాఫిక్‌ బాధలు లేనట్టే!

రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్

వెలిగొండపై రేవంత్ సైలెంట్.. తెలంగాణకు తీరని ద్రోహం.. హరీశ్ రావు ధ్వజం!

Big Stories

Advertisement
×