BigTV English

Ex CM KCR Petition: కేసీఆర్ పిటిషన్.. సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!

Ex CM KCR Petition: కేసీఆర్ పిటిషన్.. సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!

Supreme Chief Justice Comments on Ex CM KCR Petition: కేసీఆర్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా అభిప్రాయాలు వ్యక్తం పరుస్తారన్నారు. మరొక జడ్జిని నియమించాలని చంద్రచూడ్ చెప్పారు. దీంతో విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది.


న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనపడాలని సూచించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. మధ్యాహ్నం 2గంటలకు మరో పేరు వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు వెల్లడించారు.

తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశం నుంచి సీఎం గదిలోకి రేవంత్ వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత కొత్త జడ్జి పేరు చెప్పాలని సుప్రీం చీఫ్ జస్టిస్ ఆదేశించడంతో ఏజీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు.


Also Read: Protestors: పారిశ్రామికవేత్త కోసం నిరసనకారులపై పోలీసుల కాల్పులు: మద్రాస్ హైకోర్టు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు విద్యుత్ కమిషన్ రద్దు పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సుప్రీంకోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి.

అంతకుముందు జూన్ 11న విద్యుత్ కమిషన్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. విచారణ పూర్తికాక ముందే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు జస్టిస్ నరసింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ఒక అభిప్రాయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని, జడ్జి నిష్ఫక్షపాతంగా ఉండాలని సుప్రీం చీఫ్ చంద్రచూడ్ వెల్లడించారు.

Tags
Test

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×