BigTV English

Hardik Pandya @ Vadodara: పాండ్యా జీవితంలో చీకటి వెలుగులు.. వడోదరాలో ఘన స్వాగతం!

Hardik Pandya @ Vadodara: పాండ్యా జీవితంలో చీకటి వెలుగులు.. వడోదరాలో ఘన స్వాగతం!

Hardik Pandya Receives Warm welcome in Vadodara: టీ 20 వరల్డ్ కప్ విజయం సాధించి అప్పుడే పదిహేను రోజులు అవుతోంది. టీమ్ ఇండియా క్రికెటర్లందరూ ఎవరి స్వస్థాలలకు వాళ్లు వెళ్లిపోయారు. రోహిత్ శర్మ తిరిగి అమెరికా వెళ్లాడు. జూనియర్స్ టీమ్ జింబాబ్వే పర్యటన కూడా ముగించుకుని తిరిగి ఇండియా వచ్చేసింది. మన సిరాజ్ కూడా హైదరాబాద్ లో హడావుడి చేశాడు. మరిప్పుడేంటి హార్దిక్ పాండ్యాకి ఘన స్వాగతం అని అనుకుంటున్నారా..?


అదేనండి, నిజానికి కప్ కొట్టిన తర్వాత ముంబయిలోని తన నివాసానికి పాండ్యా వెళ్లాడు. అప్పుడక్కడ ఫ్లాట్ ఓనర్స్ అంతా ఘన స్వాగతం పలికారు. అయితే, ఇప్పుడు తన సొంత పట్టణం వడోదరాకి వెళ్లాడు. అదీ సంగతి.. దీంతో విషయం తెలిసిన క్రికెట్ అసోసియేషన్లు అన్నీ విమానాశ్రయం దగ్గర నుంచి ఆయన ఇంటివరకు భారీ ఏర్పాట్లు చేశారు. తాజాగా తను శ్రీలంక టూర్ కి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అందువల్ల  ఆ జోష్ మరింత ఎక్కువైంది.

ఎయిర్ పోర్టు దగ్గర నుంచి  ఓపెన్ టాప్ జీపులో హార్దిక్ పాండ్యా ప్రయాణించాడు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. పాండ్యా చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదాలు చేశాడు. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు.  ఇటీవల ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ అయిన తర్వాత, వచ్చిన ఛీత్కారాలన్నీ కూడా నేడు పూలజల్లులై కురుస్తుంటే, సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.  వడోదరాలో తన ఇంటి సమీపంలో అయితే, ఆ వీధిలోకి జీపు వెళ్లే అవకాశం కూడా లేకుండాపోయింది. మొత్తానికి పోలీసులు అతికష్టమ్మీద పాండ్యాని ఇంటికి చేర్చి  హమ్మయ్యా అనుకున్నారు.


Also Read: తప్పు చేశాను.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్

నిజానికి పాండ్యా జీవితంలో చీకటి వెలుగులు దోబూచులాడుతున్నాయి. ఎంత ఆనందం వచ్చినా, తనని ఒక విషాదం వెంటాడుతూనే ఉంది.  కెరీర్ పరంగా ఎదురైన ఒడిదుడుకులను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న పాండ్యా జీవితంలో మాత్రం ఓడిపోయేలాగే కనిపిస్తున్నాడు. భార్య నటాషాతో తెగదెంపులు అయిపోయినట్టే అంటున్నారు. ఇక విడాకులు తీసుకోవడమే ఆలస్యమని అంటున్నారు.

ఇప్పుడు తన కొడుకు పాండ్యా వద్ద ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఆల్రడీ చాలామంది క్రికెటర్లు ఇప్పటికి ఫ్యామిలీలు దూరమై ఇబ్బందులు పడుతున్నారు. వారిలో శిఖర్ ధావన్ ప్రథముడని చెప్పాలి. తన కొడుకు తన వద్ద లేకపోవడంతో కుమిలిపోతున్నాడు. ఆ అబ్బాయి పుట్టినరోజుకి కన్నీటి పర్యంతమయ్యాడు. అయినా భార్య క్షమించడం లేదు.

Also Read: Virat Anushka Viral Video: లండన్‌లో విరాట్ కొహ్లీ ఫ్యామిలీ, కీర్తనలు వింటున్న వీడియో వైరల్‌

మహ్మద్ షమీ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. కాకపోతే  షమీ భార్య మీడియా ముందుకు వచ్చి పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాడు. ఇక అజారుద్దీన్ సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం కాపురాలు చేసుకుంటున్నవారు హాయిగా ఉంటున్నారు. అందరిలాగే తన వైవాహిక జీవితం తిరిగి పట్టాలెక్కాలని, కెరీర్ లాగే చీకటి పోయి, జీవితంలో కూడా వెలుగురావాలని కోరుకుందాం.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×