BigTV English

Pravalika Death : ప్రేమ వ్యవహారమే ప్రవళిక ప్రాణం తీసిందా ? ప్రతిపక్షాలు ఏమన్నాయి ?

Pravalika Death : ప్రేమ వ్యవహారమే ప్రవళిక ప్రాణం తీసిందా ? ప్రతిపక్షాలు ఏమన్నాయి ?

Pravalika Death : గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కేసీఆర్‌ అసమర్థ పాలన వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి బాధ్యత వహిస్తూ కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంతోనే ప్రవళిక మరణించిందన్న ప్రకటనతో పోలీసులపై మండిపడుతున్నారు.


నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ప్రవళిక ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉందని అనడం దారుణమని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఒక్కరోజులోనే పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు. TSPSC కేసును ఎందుకు ఏడాదిగా నాన్చుతున్నారని నిలదీశారు. యువత ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది పోయి.. ఇలాంటి కుళ్లు రాజకీయాలు చేస్తే.. ప్రజలు బుద్ది చెబుతారని ఫైర్‌ అయ్యారు.

ప్రవళిక ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. కేసీఆర్ ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పులు చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తుంటే.. ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ కింగ్ అని ప్రచారం చేసుకుంటున్న కేటీఆర్.. పేపర్ల లీకేజీకి బాధ్యత వహించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. TSPSCపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


మరోవైపు ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్ మొద్దు నిద్ర చేస్తున్నాడని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులకు మద్దతుగా రోడ్డుమీదకు వచ్చిన బీజేపీ నేతలపై దాడులు చేయడం ఏంటని సీరియస్ అయ్యారు. దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదామని విద్యార్థులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

మరోవైపు గవర్నర్‌ తమిళిసై కూడా ప్రవళిక ఆత్మహత్యపై స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×