BigTV English

Fire: మంటల్లో స్వప్నలోక్.. లోపల ఉన్నవాళ్లు సేఫేనా?

Fire: మంటల్లో స్వప్నలోక్.. లోపల ఉన్నవాళ్లు సేఫేనా?

Fire: ఇటీవలే సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్కన్ మాల్ బిల్డింగ్ మొత్తం కాలి బూడిదైంది. ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇది జరిగిన రెండు నెలలకే.. మళ్లీ అదే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం. ఈసారి స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. 7, 8 అంతస్థుల్లోని పలు షాపులు, కార్యాలయాల్లో ఫైర్ అంటుకుంది. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి. కాంప్లెక్స్ లోపల 14 మంది బాధితులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.


మంటలు మండుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ వ్యాపించింది. చుట్టూ చిమ్మచీకటి. ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్నారు బాధితులు.

బాధితుల్లో కొందరు సెల్‌ఫోన్ లైట్స్ ఆన్ చేసి.. తాము ఉన్న ప్రాంతం తెలిసేలా చూపించారు. పొగ కమ్మేయడంతో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. రక్షించండి.. రక్షించండి.. అంటూ గట్టిగా అరిచారు.


విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. ముగ్గురు బాధితులు బాత్‌రూమ్ కిటీకీలోంచి సురక్షితంగా బయటకు రాగలిగారు. లోపల ఇంకా ఉన్నారని సమాచారం అందించారు.

రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో మరో నలుగురిని కాపాడింది. మొత్తం ఏడుగురు సేఫ్. లోపల ఇంకా ఏడుగురు చిక్కుకున్నారని అంటున్నారు. వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అందులో ముగ్గురు మహిళలని తెలుస్తోంది. ఐరన్ రాడ్స్ బ్రేక్ చేస్తేనే.. వారిని రెస్క్యూ చేయగలమని సిబ్బంది చెబుతున్నారు.

అర్జెంటుగా ఆక్సిజన్ అందించక పోతే వారి ప్రాణాలు నిలవడం కష్టం అంటున్నారు. మంటలతో పొగ వ్యాపించడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతో భవనం లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న మిగిలిన బాధితులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు మాగ్జిమమ్ ట్రై చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

Rains: సడెన్‌గా కమ్మేసి కుమ్మేసిన వాన.. 2 రోజుల పాటు ‘ఎల్లో అలర్ట్’..

Naturalstar Nani : వెంక‌టేష్ మ‌హా – KGF 2 వివాదం.. రియాక్ట్ అయిన నాని

Tags

Related News

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

Big Stories

×