E-Paper
Advertisement

Nampalli Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతదేహాల గుర్తింపు, ఘటన వెనుక అసలు కారణం ఇదే

Nampalli Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం..  మృతదేహాల గుర్తింపు,  ఘటన వెనుక అసలు కారణం ఇదే
Advertisement

Nampalli Fire Accident: నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. భవనం సెల్లారులో చిక్కుకున్న వారంతా మరణించారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. వారిలో బీబీ, ఇంతియాజ్, హబీబ్ లతోపాటు చిన్నారులు ప్రతీణ్, అఖిల్ ఉన్నారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నాంపల్లిలో ఫర్మిచర్ షాపు అగ్నిప్రమాదం వెనుక

Advertisement

శనివారం సాయంత్రం నాంపల్లి స్టేషన్‌ రోడ్డులోని హిందీ ప్రచార్‌సభ భవనం పక్కన ఐదంతస్తుల భవనంలో ఫర్నిచర్‌ షాపు ఉంది. శుక్రవారం రాత్రి ఆ షాపుకు చైనా నుంచి భారీగా ఫర్నిచర్‌ వచ్చింది. వాటిని రెండు సెల్లార్లలో భద్రపరిచారు షాపు యజమానులు. ఆ షాపులో దాదాపు 22 మంది పని చేస్తున్నారు.

వాచ్‌మెన్‌ యాదయ్య-లక్ష్మి దంపతులు తమ ఇద్దరు పిల్లలు ప్రణీత్‌,అఖిల్‌ లతో కలసి సెల్లార్‌లో నివాసం ఉంటోంది. పిల్లలిద్దరు శనివారం స్కూల్‌కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నారు. సెల్లార్‌లో ఆడుకోవాలని పిల్లలకు చెప్పి పని మీద తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం సమయంలో భవనంలోని రెండు సెల్లార్లలో అగ్నిప్రమాదం జరిగింది.

Advertisement

ఐదుగురి మృతదేహాలు వెలికితీత.. తీవ్రత వెనుక కెమికల్స్

భారీగా పొగలు రావడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అక్కడ పని చేస్తున్న ఇంతియాజ్‌, సయ్యద్‌ హబీబ్‌‌లు సెల్లార్లో చిక్కుకున్న ప్రణీత్, అఖిల్, బీబీలను బయటకు తీసుకువచ్చేందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. ఘటన గురించి తెలియగానే ఓ వైపు హైడ్రా.. మరోవైపు పోలీసులు ఇంకోవైపు ఫైర్ సిబ్బంది మొహరించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం సహాయక చర్యలు కొనసాగాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  దాదాపు 20 గంటలపాటు సహాయక బృందాలు శ్రమించాయి.

ఈ ఘటన గురించి బిగ్ టీవీ‌తో మాట్లాడారు ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్. నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఫర్నిచర్ పెట్టడం ప్రమాద తీవ్రతను పెంచిందన్నారు. బచ్చాసి యజమాని సతీష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ కోసం రాత్రంతా 200 మంది ఫైర్ కష్టపడి పని చేశారని తెలిపారు.

ALSO READ: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ

మొదటి మృతదేహం 9. 15 గంటలకు దొరికిందన్నారు. అయితే రాత్రంతా మంటలు, పొగలను అదుపులోకి తెచ్చేందుకే చాలా సమయం పట్టిందన్నారు. సెల్లార్‌లో గోడౌన్ ను ఏర్పాటు చేయడం, ఫర్నిచర్‌తోపాటు కెమికల్స్‌ను అందులో పెట్టారని వివరించారు. బేస్‌మెంట్‌ను పూర్తిగా దుర్వినియోగం చేశారని, ప్రమాదం వెనుక షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ ద్వారా కూడా ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు.

ప్రమాదకరమైన కెమికల్స్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సిబ్బంది లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదన్నారు. సెల్లార్ చివర్లో రెండు రూములు ఏర్పాటు చేశారని, మంటలు స్టార్ట్ అయిన తర్వాత రూమ్ నుండి ర్యాంప్ వైపు వెళ్లినట్టు తెలిపారు. ర్యాంప్ మొత్తం సామానులతో ప్యాక్ చేసి ఉందన్నారు.  మెట్ల మార్గం నుండి పైకి వచ్చేందుకు ప్రయత్నించారని, అక్కడ ఐరన్ షట్టర్ కు తాళం వేసి ఉండడంత బయటికి రాలేకపోయారని వివరించారు.

బిల్డింగ్ కండిషన్ మంచిగా దృఢంగానే ఉందని, ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. బిల్డింగ్ పర్మిషన్ల సమయంలో అంతా బాగానే ఉందని, కొద్ది రోజుల తర్వాత అక్రమంగా సెల్లార్లను దుర్వినియోగం చేశారన్నారు. జీహెచ్ఎంసి లో చాలా వరకు ఈ తరహా ఉల్లంఘనలకి పాల్పడుతున్నారని, ఫైర్ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందన్నారు.

 

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×