E-Paper
Advertisement

Jubilee Hills Hit & Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ట్విస్ట్.. ఐదుగురి అరెస్ట్

Jubilee Hills Hit & Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ట్విస్ట్.. ఐదుగురి అరెస్ట్
Advertisement

Jubilee Hills Hit & Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అందులో నలుగురు యువకులు, ఓ యువతి ఉన్నారు. ప్రమాదానికి ముందు వారంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ చేసిన సమయంలో కారు డ్రైవింగ్ చేసింది ఎవరు అనే.. విషయం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరోవైపు అతి వేగంగా కారు నడిపినట్లు కూకట్ పల్లికి చెందిన ద్వారంపూడి నాగని గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి యాక్సిడెంట్ చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా విచారణ సాగింది. మద్యం మత్తులో బైక్ ని ఢీ కొట్టి పరారైనట్లుగా గుర్తించారు.

Advertisement

అటు ప్రమాదంలో బౌన్సర్ తారకరాం మృతి చెందగా.. ఏసురాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తారకరాం మృతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట అతని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రాత్రి 10 గంటల వరకు హైడ్రామా నెలకొంది. ఐతే నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పడంతో డెడ్ బాడీని బంధువులు తీసుకువెళ్లారు.

ఏసీపీ హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. ఈ కేసులో ఏ1 నిందితుడు కొవ్వూరి రిత్విక్ రెడ్డి. ఏ2 వైష్ణవి, ఏ3 పొలుసాని లోకేశ్వర్ రావు, ఏ4 అభిలాష్, ఏ5 అనికేత్ లు ఉన్నారు. ప్రమాదం తర్వాత.. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో రిత్విక్ రెడ్డి తన కారును స్నేహితుడు సురేష్ రెడ్డి ఇంటిలో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్న రిత్విక్ రెడ్డి.. ప్రమాదం జరిగిన రోజు స్నేహితులకు తన ఆఫీస్ ను చూపిస్తానని తీసుకెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న రిత్విక్ రెడ్డే కారును డ్రైవ్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు ఏసీపీ హరిప్రసాద్ వెల్లడించారు.

Advertisement

.

.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×