E-Paper
Advertisement

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..
Advertisement

Nalgonda Road Accidents : నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం వెంపాడ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వస్తూ మరో నలుగురు మృతి చెందారు. రమావత్ కేశవ్ (19) అనే వ్యక్తి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాగరాజు(28) అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక.. కేశవ్ ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేశవ్ కుటుంబ సభ్యులు మృతుడిని చూసేందుకు టాటా ఏస్ లో వస్తుండగా పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కిట్టింది.

ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ఉన్న ఏడుగురు ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ కేశవులు, రమావత్ గణ్య, నాగరాజు, రమావత్ పాండు, రమావత్ బుజ్జి లుగా గుర్తించారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×