E-Paper
Advertisement

Santhosh Rao : హ్యాపీ రావు అన్ హ్యాపీ.. ఈడీకి చేరిన పంచాయితీ!

Santhosh Rao : హ్యాపీ రావు అన్ హ్యాపీ.. ఈడీకి చేరిన పంచాయితీ!
Advertisement

బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ప్రస్తుతం గులాబీ పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నేరుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఆరోగ్యం, బాగోగులు చూసుకునే వారనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గ్రీన్ చాలెంజ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమంతో ఆయన ప్రత్యేకంగా పేరు సంపాదించారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం అధికారం లేకపోవడంతో ఆయన పార్టీకి, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన్ను కేటీఆర్ అండ్ కో పక్కకు పెట్టినట్టు సైతం చర్చ జరుగుతున్నది. తాజాగా ఆయనపై ఈడీకి ఫిర్యాదు అందడంతో మరోసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది.

కల్వకుంట్ల ఫ్యామిలీ ముక్కలు..

మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ రావు వల్లే కల్వకుంట్ల కుటుంబం ముక్కలు అయ్యిందని సైతం అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సొంత తండ్రిని సైతం కలిసేందుకు అడ్డుగోడగా నిలిచారని, తన మీద లేనిపోనివి చెప్పారని సంతోష్ రావు మీద గతంలోనే జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆరోపణలు చేసింది. అంతేకాకుండా, తన సోదరుడు, తనకు మధ్య విభేదాలు రావడానికి సైతం ఆయనే కారణమని ఆరోపించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది. దాని వెనుక కొందరు ఉన్నారని, వారి పేర్లు త్వరలోనే బయటపెడతానని సైతం చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ పత్రిక మేనెజ్మెంట్ బాధ్యతల నుంచి సైతం సంతోష్ రావును కేటీఆర్ తప్పించిన విషయం తెలిసిందే.

అడ్డగోలుగా అక్రమాస్తులు..

Advertisement

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదించారని సైతం ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయన కేసీఆర్ చెంత ఉంటూ ఆయన బాగోగులు చూస్తున్నట్టు తెలుస్తున్నది. నాడు కేసీఆర్ అండతోనే భారీగా అవినీతికి పాల్పడినట్టు పలువురు గతంలోనే ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు.. జోగినిపల్లి సంతోష్ రావు భూ కుంభకోణాలు, అక్రమాలపై ఆధారాలతో సహా ఈడీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తాను అందజేసిన ఆధారాల ప్రకారం వెంటనే విచారణ చేపట్టాలని ఈడీ అధికారులను ఆమె కోరినట్టు తెలుస్తున్నది. నకిలీ ధ్రువపత్రాలను తయారు చేయించి తహశీల్దార్‌లను మేనేజ్ చేసి వందల ఎకరాలను ఆక్రమించారని ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్నారు. భూ దాందా నుంచి వచ్చిన డబ్బును లిక్కర్ స్కాంలో పెట్టారని సైతం ఆరోపించారు.

 

Advertisement

Supreme Court: వివేకా హత్య కేసు.. ఇంకో పదేళ్లు దర్యాప్తు చేస్తారా?, సీబీఐపై సుప్రీం ఆగ్రహం

ఇక సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి వారైన సుమిత్ర కోడలు సుచరిత రెడ్డికి సైతం సంతోశ్ రావు అన్యాయం చేశారని.. ఈ విషయంపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించి ఆమెకు న్యాయం చేయాలని రమ్యారావు డిమాండ్ చేస్తునన్నారు. ఇప్పటికే ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేశామని, తాజాగా ఈడీకి కూడా ఫిర్యాదు చేసినట్టు ఆమెపేర్కొన్నారు. అయితే, రమ్యారావు ఫిర్యాదుతో ఈడీ ఏ క్షణంలోనైనా సంతోష్ రావు ఆస్తులపై విచారణ జరిపే అవకాశం ఉన్నదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ విషయం తెలిసి హ్యాపీ రావు అన్ హ్యాపీగా ఉన్నారని.. భయటకు రావడం లేదని.. పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇదిలాఉండగా, ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్‌లను ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసు కేసు వెంటాడుతుండగా.. తాజాగా హ్యాపీ రావుకు ఈడీ భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×