E-Paper
Advertisement

Supreme Court: వివేకా హత్య కేసు.. ఇంకో పదేళ్లు దర్యాప్తు చేస్తారా?, సీబీఐపై సుప్రీం ఆగ్రహం

Supreme Court: వివేకా హత్య కేసు.. ఇంకో పదేళ్లు దర్యాప్తు చేస్తారా?, సీబీఐపై సుప్రీం ఆగ్రహం
Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి విచారణ సాగుతుండటంపై ధర్మాసనం మండిపడుతూ.. ‘ఇంకెంత కాలం ఈ దర్యాప్తు కొనసాగిస్తారు? ఇలా అయితే మరో పదేళ్లయినా విచారణ పూర్తి కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ట్రయల్ కోర్టు ఆదేశాలపై అసంతృప్తి

Advertisement

వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. గతంలో ఈ కేసు దర్యాప్తుపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసినప్పటికీజజ ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ తీరు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని సునీతారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సీబీఐకి సుప్రీం చురకలు

Advertisement

విచారణ సందర్భంగా ధర్మాసనం సీబీఐ తీరును ప్రశ్నించింది. ‘మీరు మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా? దర్యాప్తునకు ముగింపు ఎప్పుడు పలుకుతారు?’ అని నిలదీసింది. కేసును ఒక కొలిక్కి తీసుకురావడంలో జరుగుతున్న ఆలస్యం న్యాయ ప్రక్రియను నీరుగారుస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి అడుగులోనూ కొత్త అంశాలను తెరపైకి తెస్తూ దర్యాప్తును సాగదీయడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 5కి వాయిదా

సునీతారెడ్డి లేవనెత్తిన అంశాలపై తమ వైఖరిని తెలియజేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. లోతైన విచారణ జరగాలని ఒకవైపు, కాలయాపన జరగకూడదని మరోవైపు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.

ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసులో అసలు సూత్రధారులను పట్టుకోవడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయని, బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని బాధితురాలు సునీత గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఫిబ్రవరి 5న సీబీఐ ఇచ్చే వివరణపై అందరి దృష్టి నెలకొంది.

ALSO READ: Harish Rao: హరీష్ రావుపై సిట్ విచారణ.. మూడు గంటల పాటు కొనసాగిన తొలి సెషన్!

Related News

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

Big Stories

Advertisement
×