E-Paper
Advertisement

BRS Vs Congress: హరీశ్ రావును అడ్డుకున్న జనాలు.. చెప్పులతో కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

BRS Vs Congress: హరీశ్ రావును అడ్డుకున్న జనాలు.. చెప్పులతో కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
Advertisement

BRS Vs Congress: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని ఎంపీడీవో చౌరస్తా వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సభలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసకర పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి అనేది కేసీఆర్ నినాదమైతే, కక్షసాధింపు చర్యలే రేవంత్ విధానమని హరీష్ రావు దుయ్యబట్టారు.

గత రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ పనులు ఏమీ చేయలేదని, అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్ష నాయకులపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేవలం సెట్‌లు, తిట్లు, విచారణలు, అక్రమ కేసులతోనే కాలాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏడ్చిన వారే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

Advertisement

సభ ముగిసిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గజ్వేల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ (పునరావాస) కాలనీ ప్రజలు హరీష్ రావు వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ముంపు గ్రామాల బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ “హరీష్ రావు గో బ్యాక్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమకు రావాల్సిన పరిహారం, మౌలిక సదుపాయాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నిరసనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి పరస్పరం తోపులాటలు, దాడులకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రాజకీయ ప్రచార సభ కాస్తా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనకు స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతు తెలపడం ఘర్షణకు ప్రధాన కారణమైంది.

Advertisement

Also Read: మేడారం హుండీ లెక్కింపు.. వామ్మో రెండో రోజు ఇంత ఆదాయమా!

పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను, ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు నిరసనకారులను అదుపులోకి తీసుకుని హరీష్ రావు వాహనం అక్కడి నుంచి వెళ్లేలా మార్గం సుగమం చేశాయి. ఎన్నికల వేళ గజ్వేల్‌లో చోటుచేసుకున్న ఈ హింసాత్మక ఘటనలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×