E-Paper
Advertisement

Madaram jatara 2026: మేడారం హుండీ లెక్కింపు.. వామ్మో రెండో రోజు ఇంత ఆదాయమా!

Madaram jatara 2026: మేడారం హుండీ లెక్కింపు.. వామ్మో రెండో రోజు ఇంత ఆదాయమా!
Advertisement

Madaram jatara 2026: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా.. వేగంగా కొనసాగుతోంది. హన్మకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ లెక్కింపులో రెండవ రోజు గణాంకాలు అధికారికంగా వెల్లడయ్యాయి.

లెక్కింపు ప్రక్రియలో భాగంగా రెండవ రోజు మొత్తం 160 హుండీలను అధికారులు తెరిచారు. వీటి ద్వారా రూ. 3,54,25,200 నగదు ఆదాయం లభించింది. భక్తులు కేవలం భారతీయ కరెన్సీనే కాకుండా.. విదేశీ కరెన్సీని కూడా మొక్కుబడిగా సమర్పించుకున్నారు. రెండవ రోజు లెక్కింపులో సుమారు రూ. 63,436 విలువైన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడటం విశేషం.

Advertisement

గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ లెక్కింపులో ఇప్పటివరకు మొత్తం 285 హుండీలను పూర్తి చేశారు. ఇప్పటి వరకు మెుత్తం ఆదాయం రూ. 6,04,53,636 వచ్చింది. మెుత్తం 826 హుండీలకు.. ఇంకా 543 హుండీలు లెక్కించాల్సి ఉంది.

భారీ భద్రత, సిసి కెమెరాల నిఘా మధ్య దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంక్ సిబ్బంది , స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిగిలి ఉన్న హుండీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున.. రాబోయే మూడు నాలుగు రోజుల్లో లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి భక్తుల రద్దీ అంచనాలకు మించి ఉండటంతో.. ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

కేవలం నగదు మాత్రమే కాకుండా.. భక్తులు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను వేరుగా భద్రపరుస్తున్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వం విడుదల చేయనుంది.

Also Read: ఏంటి సార్.. నాణ్యమైన భోజనం అడిగినందుకు మరీ ఇంతలా కొడతారా.. విద్యార్థులపై హెచ్ఎం దాడి

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×