E-Paper
Advertisement

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!
Advertisement

Khairatabad By-Election: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉపఎన్నికల హీట్ మొదలైంది. హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో, అక్కడ త్వరలోనే బైపోల్ రావడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారగా, ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా.. ఈ పరిణామంతో అప్రమత్తమైన తెలంగాణ బీజేపీ.. ఖైరతాబాద్‌ను ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. దానంపై అనర్హత వేటు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హస్తినలో ఉండటం పొలిటికల్ గా మరింత ప్రాధాన్యతన సంతరించుకంది.

ఇదిలాఉండగా హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే దానం సైతం స్పందించారు. తాను ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఆయన కోర్టుకు వెళ్లకపోతే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లే లెక్క. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఇక్కడ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదని, తక్షణమే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని బీజేపీ నాయకత్వం నమ్ముతోంది. గతంలో ఎదురైన పరాజయాన్ని పక్కన పెట్టి, ఈసారి పక్కా ప్రణాళికతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.

Advertisement

తెలంగాణ బీజేపీ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక్కడ సాధించే విజయం కేవలం ఒక సీటుకే పరిమితం కాదని, రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. ఈ బైపోల్‌లో జెండా పాతడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, తామే అధికార పక్షానికి ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ వంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీ సాధించిన సంచలన విజయాలను ఖైరతాబాద్‌లోనూ రిపీట్ చేయాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. అప్పట్లో స్థానిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకుని ఏ విధంగానైతే జయభేరి మోగించారో, అదే ఫార్ములాను ఇక్కడ కూడా ప్రయోగించాలనే ధీమాతో ఉంది.

Also Read: పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

Advertisement

ఖైరతాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి డివిజన్ లోనూ పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ కసరత్తులు మొదలు పెట్టేలా కార్యాచరణ రచించాలని పార్టీ భావిస్తోంది. అందుకు ముఖ్యంగా నియోజకవర్గంలోని యువతను టార్గెట్ గా పెట్టుకోనుంది. నిరుద్యోగం, స్థానిక సమస్యలు, యువతకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా ఫోకస్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. యువత మద్దతు కూడగడితే ఖైరతాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే.. మళ్లీ చింతల రామచంద్రారెడ్డికే పార్టీ టికెట్ కేటాయిస్తుందా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా? అనేది వేచి చూడాలి.

Also Read: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు

Tags

Related News

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొత్తలో విపరీతమైన పేదరికంలో కేసీఆర్.. అప్పుడు పది రూపాయల మిత్తీకి బాకీలు ఎందుకు చేసినట్టు..?

అన్ని విచారణలు ఓ లెక్క.. ఫామ్ హౌజ్ భూముల లెక్కలు ఓ లెక్క.. నిగ్గుతేల్చాల్సిందే..! లేకపోతే……

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

Big Stories

Advertisement
×