Erravelli Land: 388 ఎకరాలు వర్సెస్ 933 ఎకరాలు.. ఈ లెక్క ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. సర్కార్ భూముల్ని కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో కలుపుకున్నారని నిండు సభలో నిలదీశారు సీఎం రేవంత్. 67 ఎకరాలు సరే మిగతా 933 ఎకరాలు ఎక్కడ అని పశ్నించారు కేటీఆర్
రచ్చగా మారిన ఎర్రవల్లిలో భూ సర్వే..
గజ్వేల్‌లో కేసీఆర్ భూముల వ్యవహారంపై ఇటు సభలో రభస కంటిన్యూస్ అవుతూనే ఉంది. ఎర్రవల్లిలో భూ సర్వే రచ్చగా మారింది. సర్వే నెంబర్ 325లోని 388 ఎకరాల లెక్కపైనే ఇప్పుడు అందరి ఫోకస్. ఆ 388 ఎకరాలను కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో కలిపేసుకున్నారని, నెల రోజుల్లో లెక్క తేల్చి ఆ భూములను దళితలుకు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.. ఆ వెంటనే రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి లో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఏరియాలో శాటిలైట్ సర్వే చేశారు. ఆ భూములు గతంలో ఎవరి పేరిట వున్నాయి. క్రయవిక్రయాల వివరాలను సేకరిస్తూ డేటా రికార్డ్ చేస్తున్నారు. ఎర్రవల్లి, వెంకాపూర్,వరదరాజాపూర్ మూడు గ్రామల సరిహద్దులోని భూములపై సమగ్ర సర్వే కొనసాగుతోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2004 వరకు కేసీఆర్ పేరిట భూములే లేవు.మరి ఇప్పుడు ఆయన కుటుంబానికి ఎకరాల కొద్ది భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఎంపీ చామలకిరణ్.
Also Read: అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!
388 ఎకరాలు వర్సెస్ 933 ఎకరాలు..
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములపై సమగ్ర విచార జరపాల్సిందేనన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ ప్రకటించినట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని దళితులకు పంచడం ఖాయమన్నారు. మరోవైపు కేసీఆర్ 72 ఏళ్ల వయసులో 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆయన ఆస్తులు పెరిగినట్టా? తగ్గినట్టా? అని ప్రశ్నించారు కేటీఆర్. గతంలో ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలు ఉందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్టకేలకు 67 ఎకరాలన్నారు. మరి 933 ఎకరాలు ఎక్కడున్నాయో చూపిస్తే సర్కార్‌కే రాసిస్తామని సెటైర్ వేశారాయన. మొత్తానికి 388 ఎకరాలు వర్సెస్ 933 ఎకరాల లెక్క పొలిటికల్ దుమారం రేపుతోంది.