Podarillu Today Episode September 19th :పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని మాధవి ఎక్కడికో వెళ్లిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ కనిపించలేదు అని కేశవ్ అనడంతో ఇక ఎక్కడికి వెళ్లాడో వస్తాడులే అని వెయిట్ చేస్తూ ఉంటారు. మాధవ్ బాధపడిపోతూ ఉంటాడు అని అందరూ అనుకుంటారు కానీ దానికి వ్యతిరేకంగా తను చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తాడు అయితే ఎవ్వరు ఏం పిలిచినా కూడా అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో మహాలక్ష్మి ఏంటి పెద్ద పిలుస్తున్న కూడా అసలు మాట్లాడటం లేదు అని అడుగుతుంది. పిలిచారా అమ్మ నాకు వినిపించలేదు అని మాధవ్ అంటాడు అయితే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని అన్నయ్యకి పిచ్చి ఏమైనా పట్టిందా ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. మాధవ్ మాత్రం మనిషాన్ని తలుచుకుంటూ సంతోషంగా ఉంటాడు. అన్నయ్య బయటకు వెళ్లిన తర్వాత ఏదో జరిగింది. అందుకే తను ఇలా పిచ్చోడిలాగా ప్రవర్తిస్తున్నాడు అని అందరికీ అనుమానం వస్తుంది.
మాధవ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది అని బాధ పడిపోతున్నాడు మళ్లీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో అని మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే చక్రిని పిలిచి పెద్ద ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చేయాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది. బయట ఆడుకుంటూ కనిపించిన చక్రిని మహాలక్ష్మి లోపలికి రమ్మని పిలుస్తుంది. మహాలక్ష్మి నన్ను లోపలికి పిలుస్తుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను లోపలికి వస్తే హాస్టల్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు అలాంటి మహాలక్ష్మి నన్ను లోపలికి పిలుస్తుంది అంటే నా మీద ఇష్టం పెరిగినట్టు ఉంది అని చక్రిప్ గాల్లో తేలిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాలి అని అద్దంలో చూసుకుని తనని తానే పొగిడేసుకుంటూ ఉంటాడు.. అంతే కాదు పర్ఫ్యూమ్ బాటిల్ మొత్తం కొట్టేసుకుంటూ ఉంటాడు.. మహాలక్ష్మి ఏం చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నారు అని అడుగుతుంది.
మహాలక్ష్మి లోపలికి రాగానే తలుపు వేయమని చెప్తుంది ఒకప్పుడు నేను లోపలికి వచ్చే తలుపు వేస్తే హాస్టల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనే తలుపు వేయమంటుంది అంటే నా మీద ప్రేమ పెరిగిపోయింది అని చక్రి పంట పండింది అంటూ చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. నేను లోపలికి పిలిచింది ఎందుకంటే పెద్ది గురించి మాట్లాడడానికి అని అనగానే ఏంటి అన్నయ్య గురించి మాట్లాడడానికి పిలిచావా అని చక్రి షాక్ అవుతాడు. అవును మా అన్నయ్య గురించి కాదు మీ అన్నయ్య గురించి మాట్లాడటానికి అతనికి మాత్రమే నేను లోపలికి పిలిచాను అని చెప్పగానే దీనికోసం లోపలికి పిలిచి తలుపు వేయమని చెప్పారా అని చక్రి అనుకుంటాడు.. అసలు చక్రి మహాలక్ష్మి మాటతో చాలా ఫీల్ అయిపోతాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా పెద్ది మల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో మీరు అతనిపై ఒక కనీసం ఉంచండి అని మహా అనగానే అలాగే అని లోపలి నుంచి బయటికి వస్తాడు.
కేశవ కన్నా ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా.. చక్రి ప్లేట్ తో కొట్టి సౌండ్ చేస్తాడు ఏంట్రా ఎందుకు లేపావురా ఇప్పుడు? ఏమైనా పిచ్చ ఏమైనా పట్టిందా నిద్రపోతున్న వాళ్ళనే లేపుతావా ఏంట్రా అనే కేశవ కన్నా ఇద్దరు కూడా చక్రిపై సీరియస్ అవుతారు. ఏం లేదురా అన్నయ్య పెళ్లి సమ్మన్న క్యాన్సల్ అయినందుకు బాధపడి పోకుండా నవ్వుతూ ఉన్నాడు కదా నాకు ఏదో అనుమానంగా ఉంది రా.. నాకు నిజంగానే అన్నయ్య మళ్లీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో అని అనుమానంగా ఉంది మనం రాత్రంతా అన్నయ్యని ఒక గంట కనిపెట్టాలి అని చక్రి ఓ రేంజ్ లో చెప్తాడు. ఆ మాట వినగానే కేశవ కన్నా కూడా అవును నిజమే అన్నయ్యని ఒక గంట కనిపెట్టాలి అని అనుకుంటారు. అయితే ముగ్గురు మూడు షిఫ్ట్ ప్రకారం నిద్ర మేలుకొని అన్నయ్యకు కాపలాగా ఉండాలి అని అనుకుంటారు కానీ కేశవ మాత్రమే అన్నయ్య వెళ్ళిపోకుండా ఉండాలని ఆలోచిస్తాడు.. దానికి మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండేలా చేయాలి అని ముగ్గురు తమ్ముళ్లు మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..