OTT Movie : అందాల తార మోనికా బెల్లుచ్చి నటించిన ఒక హాలీవుడ్ సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని అలరించింది. ఆమె అందానికి ముసలోళ్ల నుంచి, కుర్రకారు వరకు అందరూ ఫిదా అయ్యారు. ఈ కథలో ఒక ఐడియా ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. తన అందాన్ని అమ్ముకునే ఆ ఐడియా, సమస్యలను కూడా తెస్తుంది. క్లైమాక్స్ వరకు ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘The Raffle’ 1991లో వచ్చిన ఇటాలియన్ రొమాంటిక్ సినిమా. దీనికి ఫ్రాన్సెస్కో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా బెల్లుచ్చి, జూలియో స్కార్పటి, మాసిమో ఘిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1991 నవంబర్ 14 ఇటలీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
మోనికా అనే అందమైన మహిళ, తన భర్తతో కలసి సంతోషంగా జీవిస్తుంటుంది. అయితే హఠాత్తుగా ఆమె భర్త చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఆమెకు అతను అప్పులు మిగిల్చి వెళ్లిపోయాడని తెలుస్తుంది. దీంతో ఆమె అప్పులు తీర్చడానికి ఇల్లు, వస్తువులను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక తన కొడుకును చదివించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేయాలా ఆని ఆలోచిస్తుంటుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ తనకి ఒక సలహాలు ఇస్తాడు. ఒక కొత్త ఐడియా ఆమె జీవితాన్నే మార్చేస్తుంది. మోనికా తన అందాన్ని ఉపయోగించి, ఒక లాటరీ పద్దతిలో డబ్బును సంపాదించాలని ఆలోచిస్తుంది. తన ఐడియా ఊరంతా పాకిపోతుంది. ఆ ఊరి ఆడవాళ్ళంతా ఇది తెలుసుకుని షాక్ అవుతారు.
Read Also : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా
ఇప్పుడు కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆ ఊరిలో చాలా మంది ఆమె కోసం టిక్కెట్లు కొంటారు. కానీ ఆమె మనసులో కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. ఆమె ఎంచుకున్న దారి సరైనదేనా అని ఆలోచనలో పడుతుంది. ఇక చివరికి ఆమెకు ఈ టిక్కెట్ల ద్వారా చాలా డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఈ ప్రాసెస్‌లో ఆమె తన అందాన్ని అమ్ముకోవడం గురించి ఆలోచిస్తుంది. చివరికి ఆమె తన అందాన్ని అందరికీ అర్పిస్తుందా ? ఈ దారి తప్పని తెలుసుకుంటుందా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.