OTT Movie : ఒక విచిత్రమైన కంటెంట్ ఉన్న ఒక హారర్ సినిమా, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఒక పెళ్ళైన జంట విడిపోయే సమయంలో దెయ్యాలు ఎంట్రీ ఇస్తాయి. ఇక కథ ఒక రేంజ్ లో నడుస్తుంది. ఆ దెయ్యాల వల్ల ఎప్పుడూ గోడవపడే ఈ జంట, మళ్ళీ తోడుగా నిలబడుతారు. ఇక క్లైమాక్స్ వరకు ఈ సినిమా పక్కా ఎంటర్టైనర్ గా మారుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘స్టే’ (Stay) 2025లో వచ్చిన రొమాంటిక్ హారర్ సినిమా. దీనికి జాస్ సమర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో మెగలిన్ , మో మెక్రే, డొమినిక్ స్టెఫెన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 8న Huluలో రిలీజ్ అయింది. IMDbలో దీనికి 5.6/10 రేటింగ్ ఉంది.
కియారా అనే యువతి ఆత్మల గురించి రీసెర్చ్ చేస్తుంటుంది. ఆమె భర్త మైల్స్ ఒక మాజీ ఫైటర్. వాళ్లు ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోయే స్టేజ్‌లో ఉంటారు. కియారా వాళ్ల ఇంట్లో, విడిపోవడానికి సామాన్లు ప్యాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో వింత సంఘటనలు స్టార్ట్ అవుతాయి. విచిత్రమైన శబ్ధాలు, నీడలు వచ్చి వీళ్ళను భయపెడతాయి. ఆ ఇంట్లో దెయ్యాలు వాళ్లను టార్చర్ చేస్తాయి. కియారా తన రీసెర్చ్ జ్ఞానంతో ఈ దెయ్యాల గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక ఈ రీసెర్చ్ లో ఆమె ఒక సీక్రెట్ తెలుసుకుంటుంది. విడాకులు తెసుకునే వాళ్ళను ఈ దెయ్యాలు వదలవని తెలుస్తుంది.
Read Also : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే