OTT Movie : ఒక కొరియన్ సినిమా యాక్షన్ సీన్స్ తో కేక పెట్టిస్తోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సిరీస్ కొరియన్ టాప్ హిట్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. సాధారణంగా మొదలయ్యే ఈ కథ యాక్షన్ రివేంజ్ గా టర్న్ తీసుకుంటుంది. ఇది ఒక అమ్మాయి తనను పెంచిన మేనమామను చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఏ షాప్ ఫర్ కిల్లర్స్’ (A Shop for Killers) 2024లో వచ్చిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. లీ క్వాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కిమ్ హ్యే-జూన్, లీ డాంగ్-వుక్, కిమ్ జూ-హ్యుంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. 8 ఎపిసోడ్ ల ఈ సిరీస్ 2024 జనవరి 17 న జియో హాట్ స్టార్‌లో రిలీజ్ అయింది. IMDbలో 8.0/10 రేటింగ్ పొందింది.
జీ-ఆన్ అనే అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. ఆమెను తన మామ జిన్ పెంచుతాడు. ఇప్పుడు ఆమె కాలేజ్ కి కూడా వెళ్తుంటుంది. జిన్ ఆన్‌లైన్ షాప్ లో వస్తువులను అమ్ముతుంటాడు. అయితే అది సాధారణమైన షాప్ కాదు. క్రిమినల్స్‌కు వెపన్స్, డేంజరస్ వస్తువులు అమ్ముతుంటాడు. జీ-ఆన్‌కు మాత్రం ఈ వ్యాపారం గురించి తెలియదు. ఒక రోజు జిన్ హఠాత్తుగా చనిపోతాడు. అది సూసైడ్‌లా కనిపిస్తుంది. తనని పెంచిన మామ చనిపోవడంతో జీ-ఆన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక సారి ఆమె ఇంటిని సర్దుతుంటగా, జిన్ కు సంబంధించి కొన్ని సీక్రెట్స్, మరికొన్ని వెపన్స్ దొరుకుతాయి. అప్పుడే ఆమెను కొందరు కిల్లర్స్ టార్గెట్ చేస్తారు. ఇక విషయం తెలుసుకుని, ఆమె జున్-హో అనే జిన్ ఫ్రెండ్ సహాయంతో, క్రిమినల్స్ పై పోరాడటం మొదలెడుతుంది.
Read Also : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే
జీ-ఆన్ కిల్లర్స్‌తో ఫైట్ చేస్తూ, మామ షాప్ గురించి తెలుసుకుంటుంది. ఆ షాప్ లో క్రిమినల్స్‌కు చెందిన వెపన్స్ ఉండటంతో కిల్లర్స్ ఆమెను చంపాలని చూస్తున్నారని తెలుస్తుంది. జీ-ఆన్ తన మామ గతం గురించి కూడా తెలుసుకుంటుంది. జీ-ఆన్ మామ షాప్‌లో దొరికిన వెపన్స్ తో కిల్లర్స్‌ను ఎదుర్కొంటుంది. జున్-హో కూడా ఆమెకు ఫైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాడు. జీ-ఆన్ తన మామను చంపిన వాళ్ళని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. చివరికి జీ-ఆన్ రివేంజ్ తీర్చుకుంటుందా ? క్రిమినల్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.