BigTV English

OTT Movie : రాత్రికి రాత్రే యవ్వనంగా మారిపోయే భార్య… ఒక్క సిప్ తో అమరత్వం ఇచ్చే అమృతం… భర్తకు దబిడి దిబిడే

OTT Movie : రాత్రికి రాత్రే యవ్వనంగా మారిపోయే భార్య… ఒక్క సిప్ తో అమరత్వం ఇచ్చే అమృతం… భర్తకు దబిడి దిబిడే

OTT Movie : ఒక డిఫరెంట్ స్టోరీని చూడాలనుకుంటే ‘డెత్ బికమ్స్ హర్’ అనే సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ముప్పై సంవత్సరాల క్రితం థియేటర్లలో సందడి చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ ని కూడా పొందింది. ఈ కథ ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళకి ఒక మందు వల్ల అమరత్వం వచ్చే శక్తి వస్తుంది. దీంతో స్టోరీ ఊహకు అందని విధంగా నడుస్తుంది. క్లైమాక్స్ మరీ ఆరాచకంగా ఉంటుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘డెత్ బికమ్స్ హర్’ (Death becomes her) 1992లో వచ్చిన అమెరికన్ ఫాంటసీ కామెడీ సినిమా. రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో మెరిల్ స్ట్రీప్, గోల్డీ హాన్, బ్రూస్ విలిస్, ఇసాబెల్లా రోసెల్లినీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 1992 జూలై 31న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, పీకాక్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 1993లో ఈ మూవీ అకాడమీ అవార్డ్‌లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గెలిచింది. IMDbలో దీనికి 6.6/10 రేటింగ్ కూడా ఉంది.

కథలోకి వెళ్తే

మాడెలిన్ అనే హాలీవుడ్ యాక్ట్రెస్, చాలా అందంగా ఉంటుంది. ఆమె కెరీర్ కూడా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు ఉంటుంది. ఆమె తన ఫ్రెండ్ హెలెన్ తో ఎప్పుడూ పోటీ పడుతుంటుంది. హెలెన్‌కు ఎర్నెస్ట్ అనే ఒక డాక్టర్‌తో తొందర్లోనే ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. కానీ మాడెలిన్ ఎర్నెస్ట్‌ను తన వైపు తిప్పుకుని, అతన్ని పెళ్లి చేసుకుంటుంది. దీంతో హెలెన్ చాలా బాధపడి, మానసికంగా కుంగిపోతుంది. ఆ తరువాత ఆక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 14 ఏళ్ల తర్వాత హెలెన్ అందంగా, సక్సెస్‌ఫుల్ రైటర్‌గా తిరిగి వస్తుంది. మాడెలిన్ ఇప్పుడు యాక్టింగ్ కెరీర్‌ లో వెనకబడి ఉంటుంది. మాడెలిన్‌, ఎర్నెస్ట్ ల బంధం కూడా సంతృప్తి ఉండదు. అతను తాగుడికి బానిస అవుతాడు.


Read Also : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

మాడెలిన్ తన అందాన్ని తిరిగి పొందడానికి ఒక మిస్టీరియస్ మహిళను కలుస్తుంది. ఆమె దగ్గర ఉన్న ఒక వింత మందు తీసుకుంటుంది. దీంతో మాడెలిన్ మళ్లీ అందంగా మారుతుంది. ఇదే సమయంలో హెలెన్ కూడా ఆ మందును తాగుతుంది. ఆమె కూడా యవ్వనంగా మారుతుంది. ఈ మందుకు మరో పవర్ కూడా ఉంటుంది. ఇది తాగితే చావు దగ్గరికి రాదు. ఇప్పుడు ఈ ఇద్దరు మహిళలు చనిపోని శక్తిని పొందుతారు. వీళ్ళ చేతిలో ఎర్నెస్ట్ నలిగిపోతుంటాడు. ఇక కథ మరింత వైలెన్స్ గా మారుతుంది. వీళ్ళిద్దరూ తీవ్రంగా గొడవలు పడతారు. క్లైమాక్స్ ఒక విచిత్రమైన ముగింపును ఇస్తుంది. ఈ ముగింపు ఎలా ఉంటుంది ? వీళ్ళకు వచ్చిన అమరత్వం ఎలాంటి సమస్యలు తెస్తుంది ? అనే విషయాలను, ఈ ఫాంటసీ కామెడీ  సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

OTT Movie : 2 గంటల 11 నిమిషాల మలయాళం మూవీ… IMDbలో 9.4 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

OTT Movie : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే

Malayalam Movies on OTT : క్రైమ్ నుంచి కామెడీ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మలయాళం సినిమాలు ఇవే

OTT Movie : ఓటీటీలోకి 5340 కోట్ల మూవీ… ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉన్న అల్టిమేట్ యాక్షన్ అడ్వెంచర్

OTT Movie : ఓరి నాయనో… ఈ ఫ్యామిలీ మొత్తం తేడానే… ఏమైనా చేస్కోమంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చే చెల్లి

Big Stories

×