Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్ గా అలాగే సాధారణ ప్లేయర్ గా టీమిండియాకు ఎన్నో సేవలు అందించాడు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ దశకు వచ్చేసాడు. ఇప్పటికే టెస్టులు అలాగే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, త్వరలోనే వన్డేలకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత అతని భవిష్యత్తు తేలనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ మూడు రికార్డులు క్రియేట్ చేస్తే ప్రపంచంలోనే మొనగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు విరాట్ కోహ్లీ.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఇవాళ ఆస్ట్రేలియాకు టీమిండియా బయలుదేరనుంది. ఈ జట్టులో విరాట్ కోహ్లీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై జరగబోయే మూడు వన్డేల సిరీస్ లో విరాట్ కోహ్లీ రాణించి పరుగులు చేస్తే, మంచి రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ లో ఉన్నాయి. మరో 54 పరుగులు చేస్తే ప్రపంచంలోనే వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. ఈ లిస్టులో మొట్టమొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇప్పుడు సంగాక్కర రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. 54 పరుగులు చేస్తే సంగాక్కరను వెనక్కి నెడుతాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) సిరీస్ లో మరో సెంచరీ చేస్తే కోహ్లీ హిస్టరీ సృష్టిస్తాడు. ఆసీస్ పై ఒక్క సెంచరీ సాధిస్తే 30 ఇంటర్నేషనల్ సెంచరీలు విదేశాల్లో చేసిన ప్లేయర్గా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. అలాగే మరో 68 పరుగులు విరాట్ కోహ్లీ సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ కూడా బద్దలు కొడతాడు. టి20 లు అలాగే వన్డేలలో అంటే వైట్ బాల్ మ్యాచ్ లలో మొత్తం సచిన్ టెండూల్కర్ 18,436 పరుగులు చేసి ఉన్నారు. ఇటు టి20 లు అలాగే వన్డేలలో సచిన్ కంటే 68 పరుగుల వెనుకంజలో కోహ్లీ ఉన్నాడు. ఆ పరుగులు సాధిస్తే సచిన్ ను దాటిపోతాడు కోహ్లీ. మరో 23 బౌండరీలు కొడితే తన ఖాతాలో 1500 వన్డే బౌండరీలు నమోదు అయితాయి. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కేవలం 3 వన్డేలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు వన్డేలో కూడా కోహ్లీ కి బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని పైన పేర్కొన్న మూడు రికార్డులు సాధిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.