Telangana Assembly Speaker : తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు ఎన్నిక కానున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. ఎప్పుడు ఎంతో సహనంతో వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు గడ్డం ప్రసాదరావును స్పీకర్ ను చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. 2009లోనూ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు వరుసగా ఓటములు చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు.