Michaung Affects Crops | మిచౌంత్(మిగ్‌జాం) తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రైతాంగం కుదేలైంది. తుఫాను కారణంగా వర్షం, భారీగా వచీచిన గాలుల కారణంగా భారీ మొత్తంలో వరి పంట నాశనమైంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షంలో తడిసిన ధాన్యానికి మొలకలెత్తాయి.

పంట కోసి నూర్పిలు చేస్తే ఖర్చులు కూడా రావని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక కష్టపడి పండించిన పంటను ట్రాక్టర్లతో దమ్ము చేస్తున్నారు. మోపిదేవి మండలం కప్తానుపాలెంలో ఒక రైతు గంటా సుబ్బారావు ఆవేదనతో ఆరు ఎకరాల పంటను దమ్ము చేయించాడు. చెమటోడ్చి పండించిన పంటను ట్రాక్టర్‌తో తొక్కించేయడం చాలా బాధగా అనిపిస్తోందని రైతు వాపోయాడు.
ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఇంత నష్టం జరిగిందని.. అందువల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి నష్ట పరిహారం చెల్లించాలని రైతు సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.