BigTV English

Gaddar vs CM KCR : గద్దర్ చనిపోయి.. కేసీఆర్‌ బతికిపోయారా?

Gaddar vs CM KCR : గద్దర్ చనిపోయి.. కేసీఆర్‌ బతికిపోయారా?
Gaddar latest news

Gaddar latest news(Telangana today epaper):

గద్దర్ జీవితమంతా పాలక పక్షాలపై పోరాడారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి పాడారు. కాలికి గజ్జె కట్టి అన్యాయం నెత్తిన నాట్యమాడారు. అలాంటి గద్దర్ చివరికాలంలో.. బుల్లెట్ కంటే బ్యాలెటే పవర్‌ఫుల్ అని గుర్తించారు. ప్రజాస్వామ్య బాట పట్టారు. సీఎం కేసీఆర్‌ దమనకాండను వ్యతిరేకంగా రాజకీయ ఆయుధం చేపట్టారు. కాంగ్రెస్‌కు చేరువయ్యారు. సొంతపార్టీ పెట్టాలని కూడా భావించారు. ఆల్వాల్ అడ్డా నుంచి స్వస్థలం గజ్వేల్‌కు మకాన్ మార్చేశారు. ఈసారి కేసీఆర్‌పైనే పోటీ చేసి.. ఓడిస్తానంటూ పంతం పట్టారు.


గద్దర్ పొలిటికల్ ఎంట్రీని సామాన్యంగా చూడలేం. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని అనేకసార్లు ఏకం చేశారు. ఉద్యమాలను ఉర్రూతలూగించారు. పాలకులను వణికించారు. అలాంటి గద్దర్.. రాజకీయాల్లోకి వస్తే..? మళ్లీ కాలికి గజ్జె కట్టి.. గొంతెత్తి.. కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా పాట వినిపిస్తే? ఆ ప్రభావం మామూలుగా ఉంటుందా?

గజ్వేల్‌లో కేసీఆర్‌పై గద్దర్ పోటీ అనగానే.. యావత్ రాష్ట్రం అటెన్షన్ అటువైపు మళ్లుతుంది. గద్దరే స్వయంగా బరిలో దిగితే.. మిగతా ప్రతిపక్షాలు ఆయనకు మద్దతు ప్రకటించే అవకాశం ఉండేది. అన్ని విపక్ష పార్టీలు, అన్ని ప్రజాసంఘాలు, అన్నివర్గాల ప్రజలు, ఉద్యమకారులు.. ఇలా అంతాకలిసి దండుకట్టి.. గజ్వేల్‌లో గద్దర్ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించేవి. అదే జరిగి కేసీఆర్ ఓడిపోతే..? ఆ ఊహే గులాబీదళానికి నిద్ర లేకుండా చేసుండేది. కేసీఆర్‌నే ప్రజలు ఓడించారంటే.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అనే పరిస్థితి వచ్చుండేది.


సొంతంగా పార్టీ పెట్టి గజ్వేల్‌కే పరిమితం అవుదామని అనుకోలేదు గద్దర్. తెలంగాణ అంతా తిరిగి.. కేసీఆర్ అరాచకాలను ఎండగట్టాలని భావించారు. అలా గద్దర్ ఊరూరా తిరిగితే..? గొంతెత్తి పాడితే..? బీఆర్ఎస్ బేజారే. గజ్వేల్‌తో పాటు అనేక చోట్ల కారు స్పీడుకు బ్రేకులు పడేవి. తన పార్టీ పోటీ చేయని చోట.. కాంగ్రెస్‌కు బలమైన మద్దతు ప్రకటించేవారు గద్దర్. ఇప్పటికే జోరు మీదున్న హస్తం పార్టీకి.. ప్రజా యుద్ధనౌక దన్నుగా కదిలొస్తే..? కేసీఆర్‌పై పెద్ద ఎత్తున దండయాత్రే జరిగుండేది. గులాబీ పార్టీకి గూబ గుయ్య్‌ మనుండేది.

ఒక్క గద్దర్ బతికి ఉండుంటే.. ఇలా అనేక రాజకీయ సంచలనాలకు వేదికయ్యేది తెలంగాణం. కానీ, గద్దర్ హఠాన్మరణంతో.. కేసీఆర్ రాజకీయంగా బతికిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×