BigTV English

Gaddar : గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

Gaddar :  గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్‌ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా, జగ్జీవన్‌రామ్‌ విగ్రహం మీదుగా గన్‌పార్క్‌ వైపు అంతిమ యాత్ర సాగుతుంది.


అంతిమయాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం కాసేపు గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచుతారు. పాటలతో కళాకారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి ఆల్వాల్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకెళతారు. అనంతరం గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహాబోధి విద్యాలయ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్‌ భౌతికకాయం వద్ద కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గద్దర్ కు నివాళులు అర్పించారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×