E-Paper
Advertisement

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి.. న్యాయం జరగక బాధితుడి ఆత్మహత్య!

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి.. న్యాయం జరగక బాధితుడి ఆత్మహత్య!
Advertisement

Gadwal Police: స్వేచ్ఛ బ్యూరో: రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి, న్యాయం చేయాలని పలుమార్లు వారి నిర్లక్ష్యానికి ఒక అమాయక ప్రాణాన్ని బలిగొన్నారు. ఏ.ఆర్ కానిస్టేబుల్ అక్రమ సంబంధం వల్ల కాపురం కూలిపోయి, భార్యాపిల్లలు దూరమై తీవ్ర మనస్తాపానికి గురైన వడ్ల నరేష్ ఆచారి (32) అనే బాధితుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.

బాధితుడి ఆవేదనను తొక్కేసిన పోలీసులు..

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం బూరెడ్డిపల్లికి చెందిన నరేష్ ఆచారి భార్యను గద్వాలకు చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ లోబరుచుకుని తమకు దూరం చేశాడని నరేష్ జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం దక్కలేదు. న్యాయం కోసం రెండుసార్లు గద్వాల జిల్లా కేంద్రంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసినా అధికారుల్లో చలనం రాలేదు. వ్యవస్థ మీద నమ్మకం పోయి, పోలీసుల వేధింపులు తాళలేక ఈనెల 5న శంషాబాద్‌ వద్ద “నా చావుకు గద్వాల పోలీసులే కారణం” అని సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్ పెట్టి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడు.

Advertisement

Also read: ఆగా ఖాన్ ఫౌండేషన్‌కి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. సీఎం వ్యూహం అదేనా..?

లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటూ ఎస్ఐ బెదిరింపులు..

చనిపోయాక కూడా పోలీసుల బెదిరింపుల పర్వం కొనసాగింది. బాధితుడికి న్యాయం చేయడంలో విఫలమైన గద్వాల టౌన్ పోలీసులు, నరేష్ చనిపోయాక కూడా తమ ప్రతాపం చూపారు. “నరేష్ శవాన్ని ఆయన అత్తగారి ఇంటి ముందుకు తెస్తే లా అండ్ ఆర్డర్ సమస్య కింద కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఎస్ఐ ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం పోలీసుల నిరంకుశత్వానికి అద్దం పడుతోంది. న్యాయం చేయాలని పోలీసుల చుట్టూ తిరిగినా అప్పుడు న్యాయం చేయలేని పోలీసులు ప్రస్తుతం విగత జీవిగా మారినా, ముందస్తు హెచ్చరిక చేసిన ఎస్ఐ అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఓ నిండు ప్రాణం బలై పోయేది కాదని బంధువులు ఆరోపిస్తున్నారు.

బీసీ కాలనీలో ఉద్రిక్తత – బాధితుల ఆగ్రహం

Advertisement

పోలీసుల బెదిరింపులను నిరసిస్తూ, న్యాయం కావాలంటూ నరేష్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి గద్వాలలోని బీసీ కాలనీలోని అత్తగారి ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కనీసం చివరి చూపుకైనా భార్యాపిల్లలు వస్తారని ఎదురుచూసి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బాధితుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై, బెదిరింపులకు పాల్పడిన పోలీసులపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు?

Tags

Related News

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు?

ఆగా ఖాన్ ఫౌండేషన్‌కి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. సీఎం వ్యూహం అదేనా..?

అసెంబ్లీని చెడగొట్టడమే వారి కుట్ర.. బీఆర్‌ఎస్‌ తీరుపై బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

22A భూముల వెనుక పెద్దల హస్తం..? సంచలన నిజాలు బయటపెట్టిన రఘునందన్ రావు!

సుప్రీం కోర్టులో హైడ్రాకు చుక్కెదురు.. 40 ఎకరాల భూమి కేసు డిస్మిస్!

సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ!

Big Stories

Advertisement
×