E-Paper
Advertisement

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!
Advertisement

Hero’s Upcoming Dual-Sport Bike: హీరో మోటోకార్ప్ నుంచి మరో కొత్త బైక్ రాబోతోంది. గత ఏడాది నుంచి కంపెనీ ఓ డ్యూయల్ స్పోర్ట్ బైక్‌ను రోడ్లపై పరీక్షిస్తోంది. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని టెస్ట్ మ్యూల్స్ మాత్రమే కనిపించగా, తాజాగా ప్రొడక్షన్ కు దగ్గరగా ఉన్నట్లు కనిపించే బైక్ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు కనిపించింది. హీరో మోటోకార్ప్ కొత్త డ్యూయల్- పర్పస్ బైక్ కు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసిన కొద్ది వారాలకే తాజా స్పై ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో పేటెంట్‌ లో కనిపించిన మోడల్ ఇదే కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇంపల్స్‌ ను గుర్తు చేస్తున్న డిజైన్!

కొత్త బైక్ చూస్తే హీరో ఇంపల్స్ డిజైన్‌ కు సంబంధించిన కొన్ని డిజైన్ ఫీచర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పొడవైన, సన్నని బాడీ, ఎత్తుగా ఉండే ఫ్రంట్ మడ్‌గార్డ్, స్పోక్ వీల్స్ లాంటి డిజైన్ వివరాలు పాత ఇంపల్స్‌ ను పోలి ఉన్నాయి. తాజా స్పై షాట్‌లో కనిపించిన బైక్ షూనింగ్ ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇది ఇంపల్స్‌ లో గతంలో కనిపించిన రంగు కంటే కొంత డార్క్‌ గా కనిపిస్తోంది. పైకి లేచిన ఎగ్జాస్ట్, డ్యూయల్ పర్పస్ టైర్లు, వెనుక భాగంలో పెద్ద ట్యూబులర్ లగేజ్ ర్యాక్ ఆఫ్ రోడ్ కు అనుగుణంగా ఉన్నాయి. హ్యాండిల్‌ బార్ డిజైన్ కూడా హీరో ఎక్స్‌ పల్స్ 210ను పోలి ఉంది.

పేటెంట్ డిజైన్‌ తో కంపారిజన్

Advertisement

హీరో ఇటీవల దాఖలు చేసిన డిజైన్ పేటెంట్‌ లో చూపించిన బైక్ తో తాజా బైక్‌కు చాలా పోలికలు పోలి ఉన్నాయి. గత ఏడాది రోడ్లపై కనిపించిన టెస్ట్ బైక్‌ లో కూడా ఇదే తరహా డిజైన్ ఉంటుంది. పేటెంట్ ఫోటోల ప్రకారం ఇందులో చిన్న హెడ్‌ల్యాంప్‌ను ప్రత్యేకంగా రూపొందించిన ఫెయిరింగ్‌లో అమర్చారు. దాని పైన చిన్న కౌల్ ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సన్నగా కనిపిస్తుండగా, బాడీవర్క్‌ ను చాలా తక్కువగా ఉంచారు. పొడవైన సింగిల్ పీస్ సీటు కారణంగా రైడర్‌ తో పాటు వెనుక ప్రయాణికుడికి కూడా సౌకర్యవంతమైన స్థలం లభించే అవకాశం ఉంది.

ఆఫ్ రోడ్‌కు అనుకూలంగా ఉండే హార్డ్‌ వేర్

హార్డ్‌ వేర్ విషయానికి వస్తే, ముందు భాగంలో రబ్బర్ గేటర్లతో కూడిన టెలిస్కోపిక్ ఫోర్క్‌ లు ఉన్నాయి. వెనుక మోనోషాక్ సెటప్ కనిపిస్తోంది. రెండు వీల్స్ కు డిస్క్ బ్రేక్‌లు ఉండే అవకాశం ఉంది. ఖర్చును తగ్గించేందుకు ఇందులో సింగిల్-ఛానల్ ABSను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, హీరో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

XPulse కంటే తక్కువ ధరలో?

Advertisement

డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిళ్ల విషయంలో హీరోకు ఇప్పటికే మంచి ఎక్స్ పీరియెన్స్ ఉంది. కంపెనీ ఎక్స్‌ పల్స్ 200, ఎక్స్‌ పల్స్ 210 వంటి మోడళ్లను అమ్ముతోంది. అయితే, కొత్త బైక్ వాటితో పోలిస్తే మరింత సింపుల్‌గా కనిపిస్తోంది. దీంతో   సరసమైన ధరలో డ్యూయల్ పర్పస్ బైక్ కోరుకునే కస్టమర్లను దీనిని అందుబాటులో ఉంచేలా హీరో ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ బైక్ కు కంపెనీ అధికారిక పేరు వెల్లడించలేదు. అయితే ఇంపల్స్‌ తో పోలికలు ఉండటంతో ఇంపల్స్ 160 పేరుతో వస్తుందా? అనే చర్చ మొదలైంది.

Read Also: యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

Tags

Related News

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

Big Stories

Advertisement
×