22A Lands: తెలంగాణలో గత కొన్ని రోజులుగా 22A అంశంపై ఆందోళన జరుగుతుందని, రైతుల, పేద ప్రజలు ఆందోళన చెందుతున్నాని ఎంపీ రఘునందర్ రావు కాంగ్రెస్ ప్రభత్వం పై ఫైర్ అయ్యారు. 22A విషయంలో మంత్రి తప్పు చేస్తే భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ధరణి, భూభారతిల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ హైకోర్ట్ న్యాయ మూర్తితో విచారణ జరపాలని, అసైన్డ్ చట్టాన్ని ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత మందికి అసైన్డ్ భూములు ఎన్ని.. ఇపుడు ఎవరి కంట్రోల్‌లో ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
రెవిన్యూ మంత్రి ఒకలా.. ముఖ్యమంత్రి ఒకలా మాట్లాడుతున్నారు. 22A విషయంలో తప్పు చేసిన అధికారులను శిక్షించాలి. 22A భూముల విషయంలో భయపడొద్దని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ప్రజలంతా అసెంబ్లీ సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రభుత్వ భూములను మింగేస్తారని 22A ప్రకారం గుడులు, బడులు, అనాడు మంచి ఆలోచనతో లక్ష్యంతో చట్టం తెచ్చారని, పొంగులేటి ప్రిపేర్ అయి అసెంబ్లీలో మాట్లాడలేదని అన్నారు. కొండపాక వెలికట్ట గ్రామం గురించి మాట్లాడారని, ఆ గ్రామం సిద్దిపేటలో కాదు గజ్వేల్లో ఉందని అన్నారు. రాజీవ్ రహదారి జాతీయ రహదారి కాదు. తెలియనిది తెలియదు అని చెప్తే పొంగులేటి కోపం అని అన్నారు.
Also read: ఉద్యోగులను పట్టించుకోకపోవడంతోనే.. పరిపాలన కుంటుపడింది.. పథకాలు పడకేశాయి..!
సింఫోనీ కాలనీలో రెండు రిజిస్ట్రేషన్లకు రెండు రెండు లక్షలు తీసుకున్నారని, 22A లో ఉందని చెప్పిన పావని వాళ్ళ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదని రఘునందన్ రావు తెలిపారు. సింఫోనీ కాలనీలో సమస్య ఉంది. అక్కడ సమస్య ఉంది అందుకే బిజెపి, BRS లు మాట్లాడుతున్నాయని అన్నారు. ఒక సమస్య గురించి మాట్లాడితే.. రెండు పార్టీలు ఒక్కటి అయినట్లు కాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వచ్చాక 43,440 ఎకరాలు 22A కింద తీసేసిన భూములు ఎక్కడ తీసేశారు. అవి 22A లో పెట్టిన వాళ్ళపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ లు దొంగపోలీస్ ఆట ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు.
22A లో కోటి ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి. 22A లో ఉన్నా భూముల వివరాలు ఎందుకు బహిరంగంగా బయట పెట్టరు. రేపు అసెంబ్లీలో 22A పై వాస్తవాలు మాట్లాడాలని, నాకు బిఆర్ఎస్ చుట్టం కాదు కాంగ్రెస్ శత్రువు కాదని వ్యాఖ్యానించారు. 22A లో ఉన్న భూములను ఎంత సమయంలో ఎత్తేసారు. పేదలకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఏమైనా ఇస్తారా.. భూ భారతి వచ్చాకా కూడా తప్పు జరిగిందని మంత్రి పొంగులేటి చెప్తున్నారు.. తప్పులు చేసింది ఎవరు.. వాళ్లపై చర్యలు తీసుకుంటారా లేదా అని అన్నారు. 22A విషయంలో మంత్రి తప్పు చేస్తే ఆయన్ను భర్తరఫ్ చెయ్యాలని, యూనిఫార్మ్స్ సివిల్ కోడ్ చట్టాన్ని ఎవరికి ఇష్టమున్న లేకున్నా దేశంలో అమలు చేస్తారని రఘునందన్ రావు తెలిపారు.
Also Read: డిజిటల్ చెల్లింపులపై కొత్త టాక్స్.. సామాన్యుడికి మోదీ సర్కార్ దెబ్బ!
https://x.com/bigtvtelugu/status/2099764943147213200