Konda Surekha: కొండా సురేఖను తప్పించడం ఒక నిర్ణయం అయితే.. ఆ తర్వాత కాంగ్రెస్ వేసిన రాజకీయ ఎత్తుగడ మరో చర్చగా మారింది. గద్వాల విజయలక్ష్మికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్, గుండు సుధారాణికి కుడా చైర్‌పర్సన్, నేరెళ్ల శారదకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవులు దక్కాయ్. ఈ ముగ్గురూ బీసీ మహిళా నేతలే. అంటే.. ఒక బీసీ మహిళను కేబినెట్ నుంచి తొలగించిన రాజకీయ ప్రభావాన్ని, మరో ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ బ్యాలెన్స్ చేసింది. మున్నూరు కాపు, పద్మశాలి వర్గాల మద్దతు తమకు ఉంటుందని కొండా సురేఖ కామెంట్లు చేయడంతో ఈ తరహా రాజనీతి అస్త్రాన్ని ప్రయోగించారంటున్నారు.
తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని ఒక దశలో కొండా కామెంట్ చేశారు. ఇప్పుడు కొండా కుటుంబం ఇతర పార్టీల్లోని బీసీ నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారంటున్నారు. ఇదే టైంలో కొండా సురేఖ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. నిరీక్షణ ముగిసిందని, A బిగ్ అప్డేట్ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ పెట్టడం ద్వారా తన అడుగులపై క్లారిటీ ఇస్తున్నారు. మరి ఇది కేవలం ఒత్తిడి రాజకీయమా? లేక కొత్త రాజకీయ శిబిరానికి బీజమా? కాంగ్రెస్ వేసిన బీసీ కార్డు కొండా కుటుంబానికి చెక్ పెడుతుందా? లేక కొండా ఫ్యామిలీ అదే బీసీ సమీకరణంతో కాంగ్రెస్‌కే సవాల్ విసురుతుందా?