Gas Cylinder Explosion: నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదొక ప్రదేశంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని రెండు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం విన్న జనం.. భయంతో పరుగులు తీశారు.
అయితే సమయంలో స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ పేలుడు ధాటికి షాపు మొత్తం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న శంకర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గతంలో హైదరబాద్ నగరంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లు జరుగుతున్నాయని ఇటీవల పలు కేసులు నమొదయ్యాయి.
మరి ఇలాంటి అక్రమంగా రవాణా చేస్తున్న ఆ గ్యాస్‌కి సంబంధించి సిబ్బంది ఎవరైతే ఉన్నారో.. వారందరిని అదుపులోకి తీసుకుని.. పోలీసులు ఏ విధంగా విచారిస్తారో.. వారిని అరెస్టు చేస్తారా..? ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక నివాసాల వద్ద ఇటువంటి ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేసే షాపులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఎగిసిపడుతున్న నీటి ఊట.. రెస్క్యూ టీంకి మరో ముప్పు
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ అంబర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ రేకుల షెడ్డులో మంటలు ఎగసిపడ్డాయి. భారీగా మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.