BigTV English

Sreeleela : బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో శ్రీలీల ఏం చేస్తోంది ? డేటింగ్ లో ఉన్నారా ?

Sreeleela : బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో శ్రీలీల ఏం చేస్తోంది ? డేటింగ్  లో ఉన్నారా ?

Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) తాజాగా స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ఇంట్లో దర్శనం ఇవ్వడం క్యూరియాసిటీని పెంచేసింది. అసలు ఈ అమ్మడు ఆ హీరో ఇంట్లో ఏం చేస్తోంది? బాలీవుడ్ స్టార్ తో ఆమె అలా కనిపించడం ఏంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. మరోవైపు ఆ హీరోని డేటింగ్ చేస్తుందా? అనే అనుమానాలు బయలుదేరాయి. అసలు శ్రీలీల బాలీవుడ్ హీరో ఇంట్లో ఎందుకు కన్పించింది? అనే వివరాల్లోకి వెళ్తే…


కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల సందడి 

‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అందాల బొమ్మ శ్రీలీల. తన అదిరిపోయే డాన్సింగ్ స్కిల్స్ తో పాటు అంద చందాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ, అతి తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే అవకాశాలు మెండుగా వచ్చినప్పటికీ, వరుస ప్లాప్స్ పడడంతో ఆమె కెరియర్ కి స్పీడ్ బ్రేక్ పడింది. టాలీవుడ్ లో దాదాపు అవకాశాలు అన్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ ‘కిస్సిక్’ సాంగ్ తో ఈ బ్యూటీ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది.


ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో ఈ బ్యూటీ బిజీ బిజీగా గడుపుతోంది. ‘పరాశక్తి’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న శ్రీలీల… హిందీ హీరో కార్తిక్ ఆర్యన్ తో బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ తో కలిసి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ 

ఓ వేడుకలో శ్రీలీల, కార్తీక్ ఇద్దరూ కలిసి కన్పించడం కొత్త రూమర్లకు దారి తీసింది. ఇటీవల సర్టిఫైడ్ డాక్టర్ అయిన కార్తీక్ సోదరి కృతిక తివారి ఈ పార్టీని ఇచ్చినట్టు సమాచారం. హీరో కార్తీక్ ఇంట్లో జరిగిన ఈ వేడుకకు శ్రీలీల స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం అందరికి దృష్టిని ఆకర్షించింది. ఇంకేముంది వెంటనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీలీల ను కార్తీక్ సోదరి ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతుంది. అలాగే శ్రీలీల కూడా ఒక డాక్టర్ కావడం మరో విశేషం. అయితే ఈ జంట డేటింగ్ చేస్తున్నారనే రూమర్లపై ఇంకా స్పందించలేదు.

ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న మూవీ ‘ఆషికి 3’. ఈ సినిమాలో శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కార్తీక్ ఆర్యన్ ఇందులో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో రగ్గ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ మూవీని 2025 లో దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×