SLBC tunnel Collapse: SLBC రెస్క్యూ ఆపరేషన్ 11 వ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. సొరంగంలో చిక్కిన 8 మంది జాడ ఇప్పటి వరకూ కనిపించనే లేదు. GPR పరికరం గుర్తించిన 8 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్ గుర్తించిన 4 చోట్ల.. 5 నుంచి 12 మీటర్ల మేర బురద, మట్టి పేరుకుపోయింది. పలు చోట్ల రంధ్రాలు పడటంతో నీరు ఊరుతోంది. కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్దరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ తవ్వకాల్లో NDRF, NDRI, సింగరేణి కార్మికుల బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. భారీగా వస్తున్న ఊట నీటి కారణంగా.. పదే పదే ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఊట నీటిని హెవీ మోటార్ల సాయంతో.. బయటకకు పంపింగ్ చేస్తున్నారు.
నేడు టీబీఎం మిషన్ కటింగ్ పనులు తుదిదశకు చేరుకోనున్నాయి. ఉత్తరాఖండ్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన.. ర్యాట్ హోల్ మైనర్స్ ద్వారా ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ కోసం డ్రిల్లింగ్ పనులు చేపట్టగా.. సాయంత్రానికి ఈ కన్వేయర్ బెల్ట్ బెల్ట్ సిద్ధం కానుంది. భూ ప్రకంపనలపై 14వ కిలోమీటర్ దగ్గర భూ ఉపరితలంపై సర్వే చేపట్టారు. 4 షిఫ్టులలో 70 మందితో ఈ మొత్తం ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్, ఎస్పీ చూస్తున్నారు.
ఇవాళ కలన్వేయర్ బెల్ట్ రిపేర్ పూర్తయ్యే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్టు అందుబాటులోకి వస్తే రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ కానుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు నీటి ఊట అడ్డంకిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. TBM మిషన్ వెనుక పెద్ద ఊబి ఉందంటున్నారు అధికారులు. 13.5 కిలో మీటర్ దగ్గర నీటి ఊట ఎక్కువగా ఉందని చెబుతున్నారు. TBM మిషన్‌ని పూర్తిగా తొలగిస్తేనే 8 మంది కార్మికుల జాడ తెలిసే చాన్స్ ఉందంటున్నారు అధికారులు. అనేక పరికరాలతో రెస్క్యూ టీం స్కానింగ్ చేస్తున్నాయి. ఒక్కో షిఫ్టులో 70 మంది పని చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. టార్గెట్ ఫిక్సయ్యింది?
టీబీఎం మిషన్ కటింగ్ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. ప్లాస్మా కట్టర్స్ ఉపయోగించినా కూడా ఐరన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో కటింగ్ పనులు కష్టంగా ఉన్నాయి. మరోవైపు నీళ్లు, బురద వేగంగా రావడంతో సమస్య జటిలంగా మారుతోంది. అయితే గంటలు.. రోజులు గడుస్తున్నా.. పరిస్థితిలో ఆశించినంతగా మార్పు కనిపించడం లేదు.
సొరంగం లోపల పరిస్థితులు రెస్క్యూ బృందాలకు ఒక ఛాలెంజ్‌గా మారాయి. నాలుగు షిఫ్టుల్లో 12 సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులను సవాల్‌గా తీసుకొని ముందుకెళ్తున్నాయి. ఐతే టన్నెల్ లోపల 13.5 కిలో మీటర్ల పాయింట్ దగ్గరే అసలు సమస్య ఉంది. నీటి ఊట ఫోర్స్‌గా వస్తోంది. దానికి బురద కూడా తోడవ్వడంతో.. దాన్ని దాటి ముందుకెళ్లలేకపోతున్నాయి.