E-Paper
Advertisement

GHMC: చివరి పాలక మండలి సమావేశంలో మేయర్ భావోద్వేగ ప్రసంగం

GHMC: చివరి పాలక మండలి సమావేశంలో మేయర్ భావోద్వేగ ప్రసంగం
Advertisement

GHMC: తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద నగరంగా రూపాంతరం చెందిన గ్రేటర్ కోర్ అర్బన్ రీజియన్ ఏరియాకు రానున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) జీహెచ్ఎంసీ రూపొందించిన మెగా బడ్జెట్ కు ఎట్టకేలకు శనివారం నిర్వహించిన స్పెషల్ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. రానున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్-2026-27 ప్రధాన అజెండాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆ తర్వాత కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) కౌన్సిల్‌లో బడ్జెట్‌ను ప్రవేశెట్టినానంతరం సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. బడ్జెట్ పై కాపీ పేస్ట్ బడ్జెట్ అంటూ, బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు పెరిగిన విస్తీర్ణానికి సరిపోవని బీజేపీ వ్యాఖ్యానించగా, అత్యవసర సేవలైన శానిటేషన్, స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం కేటాయింపు లు మరింత పెంచాలని ఎంఐఎం సభ్యుడు సలీమ్ బేగ్ కోరారు.

జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ..

బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ(Samala Hema) మాట్లాడుతూ.. ప్రస్తుతం బడ్జెట్ లో సీఆర్ఎంపీకి నిధులు కేటాయించినప్పటికీ, గత గులాబీ సర్కారు హయాంలో సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని ఎంతో పటిష్టంగా అమలు చేస్తూ సిటీలో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టిన సంగతి గుర్తు చేశారు. బడ్జెట్ లోని కేటాయింపులు, ఆదాయం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గ్రీన్ బడ్జెట్ ను కేటాయించిన విధంగా నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వెచ్చించాలని సూచించారు. బీజేపీ సభ్యుడు శ్రవణ్, మజ్లీస్ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ లు బడ్జెట్ లోని కేటాయింపులు, విలీన పట్టణ స్థానిక సంస్థల ఆదాయం, అప్పులపై క్లారిఫికేషన్ కోరగా, వారికి క్లారిఫికేషన్ ఇవ్వకుండానే మధ్యాహ్నాం రెండున్నర గంటలకు బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదిస్తూనే మేయర్ కౌన్సిల్ లు ముగించారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు, అధికారులు, రాజకీయ వర్గాలు ఎపుడెపుడోనని భావించిన పాలక మండలి కౌన్సిల్ చివరి సమావేశం ముగిసింది.

Advertisement

Also Read: Samsung AC: తక్కువ కరెంట్ వినియోగించే కొత్త ఏసీలు లాంచ్ చేసిన శాంసంగ్.. ఏఐ విండ్‌ఫ్రీ టెక్నాలజీతో స్మార్ట్ సేవింగ్స్

ఇటీవలే జీహెచ్ఎంసీలో..

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26)నకు సంబంధించి రూ.10714.73 కోట్ల బడ్జెట్ తో పోల్చితే వచ్చే వార్షిక బడ్జెట్ రూ. 745.27 కోట్లు పెంచి రూ. 11 వేల 460 కోట్లతో రూపొందించారు. జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అసరాలు, అభివృద్ది, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించినట్లు, ఒక వైపు విలీనం, పునర్విభజన ప్రక్రియలకు సమాంతరంగా అహార్నిశలు శ్రమించి బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు కమిషనర్ కౌన్సిల్ లో వివరించారు.

ప్రాపర్టీ ట్యాక్స్ రూ. 2038 కోట్లు

Advertisement

భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల నుంచి ఆదాయం సమకూరుతున్నందున ఈ సారి రెవెన్యూ ఆదాయాన్ని రూ. 6441 కోట్లుగా పొందుపరిచారు. కానీ గత ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ రూ. 2038 కోట్ల వసూలు కాగా, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఆదాయాన్ని తక్కువగా కేటాయించటంపై సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా రూ. 4 వేల 57 కోట్లుగా పేర్కొన్నారు. ​మొత్తం బడ్జెట్ పరిమాణం రూ. 11,460 కోట్లు కాగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ రూ.10714.73 కోట్ల బడ్జెట్ తో పోల్చితే వచ్చే వార్షిక బడ్జెట్ ను రూ. 745.27 కోట్లు పెంచి రూపకల్పన చేసిన బడ్జెట్ ను శనివారం స్పెషల్ కౌన్సిల్ ఆమోదించటంతో త్వరలో సర్కారుకు పంపనున్నట్లు తెలిసింది.

Alson Read: Naatu Kodi Pulusu: రాగి సంగటి, గారెల్లోకి ఆంధ్రా స్టైల్ నాటు కోడి పులుసు.. ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×