E-Paper
Advertisement

MLA Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన మల్లారెడ్డి.. కేసీఆర్ అంటూ ప్రచారం

MLA Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన మల్లారెడ్డి.. కేసీఆర్ అంటూ ప్రచారం
Advertisement

MLA Malla Reddy: స్వేచ్ఛ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దూసుకుపోతోంది. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో బండమాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Malla Reddy) విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండమాదారం 19వ వార్డు అభ్యర్థి సరిత కుమార్, శ్రీరంగవరం గ్రామంలోని 17వ వార్డు అభ్యర్థి నర్సింహా ముదిరాజ్, 18వ వార్డు అభ్యర్థి ఓం ప్రకాష్ గౌడ్, 20వ వార్డు అభ్యర్థి వరలక్ష్మీ సురేందర్, 21వ వార్డు అభ్యర్థి భాస్కర్, నూతనకల్ గ్రామంలోని 16వ వార్డు అభ్యర్థి సద్ది సురేష్ రెడ్డి, 22వ వార్డు నిశిత రెడ్డి లకు మల్లారెడ్డి ప్రజల మద్దతు కోరారు.

మాజీ సీఎం కేసీఆర్ పాలనలో..

గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్‌షోకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రచారాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఎక్కడా కనబడటం లేదని విమర్శించారు. రాష్ట్రం, మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అటు కేసీఆర్, ఇటు తన నాయకత్వమే అవసరమని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 4 తప్పులకు దూరంగా ఉండండి!

సోంత నిధులతో..

గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు, దేవాలయాలు నిర్మించానని గుర్తు చేస్తూ, చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జీ వెంకట్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మెట్టు శ్రీకాంత్ రెడ్డి, జగన్ రెడ్డి, నవీన్ రెడ్డి, నాగరాజు ముదిరాజ్, సందీప్ గౌడ్ ,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Iswarya Menon : యెల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న ఐశ్వర్య.. ఎంత అందంగా ఉందో..

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×