E-Paper
Advertisement

జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల్లో వరుస అగ్ని ప్రమాదాలు.. ప్రమాదమా? కుట్రా?

జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల్లో వరుస అగ్ని ప్రమాదాలు.. ప్రమాదమా? కుట్రా?
Advertisement

GHMC Fire Accident: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరగటం పలు అనుమానాలకు తావిస్తుంది. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన జీహెచ్ఎంసీకి చెందిన రెండు జోనల్ కమిషనర్ ఆఫీసుల్లో ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు అగ్ని ప్రమాదాలు జరగటం నిజంగా ప్రమాద వశాత్తు సంభవించిందేనా? పలు అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లను బూడిదే చేసేందుకు ఎవరైనా చేసిన పన్నాగమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వరుస అగ్ని ప్రమాదాలు..

Advertisement

ఇప్పటి వరకు సికిందరాబాద్ జోనల్ ఆఫీసులోని చెక్ సెక్షన్ లో అగ్ని ప్రమాదం జరగగా, తాజాగా ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులోని రెండో అంతస్తులోని చెక్ సెక్షన్ లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగటం గమనార్హం. కరోనాకు ముందు కూడా ఇదే ఆఫీసులోని రెండో అంతస్తులోని చెక్ సెక్షన్ లో అగ్ని ప్రమాదం జరిగినా, అధికారులు ఎలాంటి విచారణకు ఆదేశించకుండా, షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని సమాధానం చెప్పారు. విలువైన డాక్యుమెంట్ల కాలి బూడిదైనా గతంలో, తాజాగా జరిగిన ప్రమాదంపై విచారణలు చేపట్టకపోవటం చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎలాంటి సాంకేతికపరమైన ఆధారాలు లేవు. ఇపుడు శుక్రవారం కూడా మళ్లీ రెండో అంతస్తులోని చెక్ సెక్షన్ లో అగ్ని ప్రమాదం జరగటం పలు అనుమానాలకు తావిస్తుంది. విషయం తెల్సుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆఫీసును సందర్శించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీసినట్లు తెలిసింది.

అధికారులపై అనేక అనుమానాలు..

Advertisement

కానీ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాద వశాత్తు ప్రమాదం జరిగినట్లయితే విచారణకు ఎందుకు ఆదేశించలేదని కొందరు ఉద్యోగులు, యూనియన్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అందించే పౌర సేవలకు సంబంధించి బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలతో పాటు జీహెచ్ఎంసీకి వచ్చే ప్రతి పైసను, ఖర్చు చేసే ప్రతి పైసను లెక్కించే చెక్ సెక్షన్ లోనే వరుసగా అగ్ని ప్రమాదాలు జరగటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండో అంతస్తును ఇటీవలే లక్షల రూపాయలు ఖర్చు చేసి, రెనొవేట్ చేసిన తర్వాత అగ్ని ప్రమాదం జరగటం, దానికి షార్ట్ సర్క్యూట్ కు కారణమై ఉండవచ్చునని అధికారులు చెప్పటంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిపీటెడ్ బిల్లుల చెల్లింపుతో సంబంధం ఏమైనా ఉందా?

జీహెచ్ఎంసీలో ఇటీవలే చెల్లింపులు జరిపిన పనులకు తిరిగి రిపీటెడ్ గా బిల్లులు చెల్లించిన వ్యవహారం బయట పడిన సంగతి తెల్సిందే. ఏకంగా రూ. 136 కోట్లను చెల్లించిన ఖాతాలకే తిరిగి చెల్లించిన ఘటన మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత ఇంజనీరింగ్ ఈ ప్రోక్యూర్ మెంట్ వ్యవస్థను రీ మ్యాపింగ్ చేస్తున్న సయలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదానికి రిపీటెడ్ గా చెల్లించిన బిల్లుకేమైనా సంబంధముందా? అన్న చర్చలు కూడా లేకపోలేవు. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంతో ఖైరతాబాద్ జోన్ ఆఫీసులో ఇప్పటి వరకు మూడు సార్లు, సికిందరాబాద్ జోన్ ఆఫీసులో ఒక సారి ఈ ప్రమాదాలు జరిగినా, అన్ని భవనాల యజమానులకు ఫైర్ సేఫ్టీ పై నీతులు చెప్పే జీహెచ్ఎంసీ ఎందుకు తన జోనల్ ఆఫీసుల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటం లేదన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.

విచారణ జరిపించాలి: యూనియన్

జీహెచ్ఎంసీలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై, తాజాగా జరిగిన ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులో జరిగిన ప్రమాదంపై పోలీసు, విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ డిమాండ్ చేశారు. తాజాగా ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులో ఇటీవల రెనొవేట్ చేసిన ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటం పై కారణాలేమిటీ? అన్న వివరాలను వెలికి తీసేందుకు వెంటనే విచారణకు ఆదేశించి, ప్రమాదంలో కాలి బూడిదైన విలువైన డాక్యుమెంట్ల వివరాలను కూడా బయట పెట్టాలని కృష్ణ డిమాండ్ చేశారు.

Also Read: లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

Tags

Related News

సదాశివపేటలో ఏసీబీ మెరుపు దాడి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్ అధికారులు

ఇన్నాళ్లూ సైలెంట్.. ఇక సిట్ సైరన్ మోగించనుందా? ఫోన్ ట్యాపింగ్‌లో బిగ్ అప్‌డేట్!

‘మూడేళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం’.. సీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!

ఒక్క స్కాన్‌తో మీ భూమి మ్యాప్ అంతా మీ ఫోన్‌లోనే.. కొత్త పాస్‌బుక్‌ల ప్రత్యేకతలు ఇవే!

ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. అనాథలకు ఆస్తి రాసిస్తూ సూసైడ్ నోట్

OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

Big Stories

Advertisement
×