E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్స్ బదిలీల వెనుక మర్మమేంటి? కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారా?

GHMC: జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్స్ బదిలీల వెనుక మర్మమేంటి? కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారా?
Advertisement

GHMC:  దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలో వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల చేపట్టిన భారీ ప్రక్షాళనలో భాగంగా రెండు దశలుగా ఏకంగా 300 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ఇతరత్ర క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులను బదిలీ చేస్తూ కమిషనర్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలతో బదిలీలు అసంపూర్తిగానే మిగిలిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు చేయకముందు జీహెచ్ఎంసీ వివిధ క్యాటగిరీలకు చెందిన మ్యాన్ పవర్ ను సప్లై చేసే ఏజెన్సీలకు ఔట్ సోర్స్ ఉద్యోగుల వివరాలను పంపించాలని కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న వాదనలున్నాయి. ఈ వ్యవహారంలో పలు విభాగాల హెచ్ఓడీలు ఏజెన్సీలపై పలు రకాలుగా వత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

కమిషనర్ ఔట్ సోర్స్ ఉద్యోగుల బదిలీలు

కమిషనర్ ఆదేశాలు సక్రమంగా అమలు కాకపోవటానికి ఒక రకంగా వివిధ విభాగాల హెచ్ఓడీలే కారణమన్న వాదనలున్నాయి. ప్రస్తుతం 2 వేల 53 కిలోమీటర్ల విస్తీర్ణంలోని 60 సర్కిళ్లు, 300 మున్సిపల్ వార్డులతో పాటు 12 జోన్లతో కొనసాగుతున్న జీహెచ్ఎంసీని ఈ నెల 10వ తేదీ తర్వాత మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో పాటు మూడు కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ తరహాలో వివిధ విభాగాల వింగ్ లను ఏర్పాటు చేసిన సేవలందించాలన్న ఉద్దేశ్యంతో కమిషనర్ ఔట్ సోర్స్ ఉద్యోగుల బదిలీలు చేపట్టారు.సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్న కొందరు ఔట్ సోర్స్ ఉద్యోగులను మరో 20 కిలోమీటర్ల దూరంలోనున్న శేరిలింగంపల్లి, సైబరాబాద్, శంషాబాద్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్ గిరిలలోని వివిధ వింగ్ లకు బదిలీ చేసినట్లు సమాచారం. కానీ జీహెచ్ఎంసీకి మ్యాన్ పవర్ సప్లై చేసే ఏజెన్సీలు కొన్ని ఉద్యోగుల పూర్తి వివరాలివ్వకుండా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ వింగ్ లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వివరాలను గోప్యంగా ఉంచి, మిగిలిన ఉద్యోగుల వివరాలను బదిలీ కోసం పంపినట్లు వాదనలున్నాయి.

ఏజెన్సీలే కీలక పాత్ర పోషించాయా?

Advertisement

ఏళ్ల నుంచి జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్స్ కంప్యూటర్ ఆపరేటర్ల వివరాలను ఏజెన్సీలు ఎందుకు బదిలీ కోసం కమిషనర్ కు పంపలేదు. ఇందులో ఏజెన్సీలే కీలక పాత్ర పోషించాయా? లేక వివిధ విభాగాధిపతులే తమకు నచ్చిన ఉద్యోగుల వివరాలను పంపించొద్దంటూ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏదైనా మ్యాన్ పవర్ ఏజెన్సీలు తమకు నచ్చిన, విభాగాధిపతులు చెప్పిన ఉద్యోగుల వివరాలను బదిలీల జాబితాలో పొందుపర్చకుండా కమిషనర్ కర్ణన్ ను తప్పుదోవ పట్టించి, రెండు దఫాలుగా 300 మంది ఉద్యోగుల బదిలీలు చేసేలా ఏజెన్సీలు వ్యవహారించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Municipal Elections: ఘన్ పూర్ మున్సిపాలిటీలో జోరందుకున్న ప్రచారం.. చైర్మన్ పీఠంపై ఆ మూడు పార్టీల నజర్!

విభాగాధిపతులే సూత్రధారులా?

Advertisement

జీహెచ్ఎంసీలో ఇటీవలే రెండు దఫాలుగా కమిషనర్ చేపట్టిన ఔట్ సోర్స్ ఉద్యోగుల బదిలీలు అసంపూర్ణంగా, నిబంధనలకు విరుద్దంగా జరిగేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాధిపతులే సూత్రధారులన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. వివిధ విభాగాల హెచ్ఓడీలు నిబంధనలకు విరుద్దంగా పదవుల్లో కొనసాగుతూ ఇప్పటి వరకు పలు రకాల అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి అక్రమాలు, అవినీతి దందాలో వారి ఛాంబర్లలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్స్ కంప్యూటర్ ఆపరేటర్లే కీలక పాత్ర పోషిస్తున్నందున, వారిని పంపించే ఇష్టం లేకనే విభాగాధిపతులు సదరు ఉద్యోగుల వివరాలను కమిషనర్ కు పంపకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి.

అటెండెన్స్ సర్టిఫికెట్ ను హెచ్ఓడీలే జారీ

ఏళ్ల తరబడి చాంబర్ ఔట్ సోర్స్ ఉద్యోగులు, వివిధ విభాగాల అధిపతులు గుట్టు చప్పుడు కాకుండా అవినీతి దందాను కొనసాగిస్తుండగా, ఇపుడు వారు బదిలీ అయి వెళితే, వారి స్థానంలో వచ్చే వారు అదంతా డీల్ చేయలేకపోతారన్న అనుమానంతోనే ప్రధాన కార్యాలయంలోని మూడు, నాలుగు అంతస్తుల్లోని కొన్ని ముఖ్యమైన విభాగాల హెచ్ ఓడీలు ఔట్ సోర్స్ ఉద్యోగుల పూర్తి స్థాయి బదిలీలు కాకుండా అడ్డుకున్నారంటూ జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ ఔట్ సోర్స్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సంబంధించి ప్రతి నెల అటెండెన్స్ సర్టిఫికెట్ ను హెచ్ఓడీలే జారీ చేస్తున్నందున, ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని హెచ్ఓడీలు చక్రం తిప్పినట్లు సమాచారం.

పని భారానికి భయపడి

జీహెచ్ఎంసీ రూపాంతరం, పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జీహెచ్ఎంసీలోకి ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య పెరిగింది. మున్ముందు జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించనున్న విషయాన్ని ముందుగానే తెల్సుకున్న పలు విభాగాల్లోని ఔట్ సోర్స్ కంప్యూటర్ ఆపరేటర్లు తమకు బదిలీల్లేకుండా తమ సీటును ప్రధాన కార్యాలయంలోనే పదిలం చేసుకునేందుకు, తమను ఐఏఎస్ ఆఫీసర్ల చాంబర్లకు బదిలీ చేస్తే ఎలాంటి అవినీతికి పాల్పడే అవకాశం లేకపోవటంతో పాటు పని భారం పెరుగుతుందన్న భయంతోనే పలు వింగ్ లలోని ఔట్ సోర్స్ ఉద్యోగులు విభాగాధిపతుల ద్వారా పైరవీలు చేసుకుని బదిలీలు చేయాల్సిన ఉద్యోగుల జాబితాలో తమ పేర్లు లేకుండా జాగ్రత్త పడ్డారంటూ మరి కొందరు ఔట్ సోర్స్ ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు.

Also Read: Mahabubabad Politics: వార్డు ఎన్నికల్లోనూ సర్పంచ్ ఎన్నికల దుస్థితేనా? పోటాపోటీగా ఖర్చులు.. ఓడితే బాధలు తప్పవా?

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×